Watch: మెలోనీకి విసుగు తెప్పించిన బైడెన్‌!

Published on Fri, 07/12/2024 - 15:02

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ గురించి వీడియోలు వైరల్‌ అవుతుండడం చూస్తున్నాం. అయితే.. ఇటలీ పీఎం మెలోనీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విసుగు తెప్పించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది.

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి సంబంధించిన మూమెంట్స్‌ కొన్ని సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుండడం చూస్తున్నాం. ముఖ్యంగా భారత ప్రధాని మోదీకి, ఆమెకు మధ్య ప్రత్యేకంగా ‘మెలోడీ’(మోదీ+మెలోనీ) మూమెంట్స్‌ పేరిట ప్రత్యేకంగా వైరల్‌ అవుతుంటాయి కూడా. అయితే..

వాషింగ్టన్‌లో జరిగే నాటో సదస్సు కోసం వెళ్లిన ఇటలీ ప్రధాని మెలోనీకి, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ విసుగు తెప్పించారు. మూడో రోజు సదస్సు ప్రారంభం కోసం సభ్యదేశాల ప్రపంచ దేశాల అధినేతలంతా ఎదురు చూస్తున్నారు. ఆ నిరీక్షణ మెలోనీకి చిరాకు తెప్పించినట్లుంది. ఎదురుగా ఉన్న ఫిన్లాండ్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ స్టబ్‌తో సంభాషిస్తూనే.. అంత ఇంకా ఎంత టైం? అంటూ అన్నారామె. దానికి అధ్యక్షుడు స్టబ్‌ తన ఫోన్‌ బయటకు తీసి టైం చూసి ఏదో చెప్పారు. దీంతో ఆమె మరోసారి కళ్లతో సైగ చేసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

సుమారు 40 నిమిషాలు ఆలస్యంగా బైడెన్‌, నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌తో కలిసి వచ్చారు. మొత్తంగా ఉదయం 10గం.లకు ప్రారంభం కావాల్సిన ఆ సదస్సు.. లేట్‌గా ప్రారంభమైంది. అన్నట్లు మెలోనీ-బైడెన్‌ మధ్య ఈ తరహా వైరల్‌ ఇన్సిడెంట్‌లు ఇంతకు ముందు కూడా వచ్చాయి.

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)