దాతలకు బైడెన్, హారిస్‌ కృతజ్ఞతలు

Published on Tue, 12/17/2024 - 05:30

వాషింగ్టన్‌: ఎన్నికల ఓటమి తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు హారిస్‌ తొలిసారిగా ఒకే చోట కలిసి కనిపించారు. డెమొ క్రటిక్‌ నేషనల్‌ కమిటీ ఆదివారం నిర్వహించిన హాలిడే పార్టిలో వారిద్దరూ వేదికను పంచుకున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రచార నిమిత్తం 200 కోట్ల డాలర్లకు పైగా విరాళాలిచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. 

‘‘డెమొక్రాట్లు విలువల కోసం పోరాటం సాగించాలి. మన స్ఫూర్తి ఓడలేదు. మనం ఓడిపోలేదు. బలంగా ఉన్నాం. దేనికోసం పోరాడుతున్నామో మనకు స్పష్టత ఉంది’’అని అతిథులుతో బైడెన్, హారిస్‌ అన్నా రు. ‘‘కింద పడితే కచ్చితంగా లేవాల్సిందే.. ఎంత వేగంగా లేస్తారనేదే వ్యక్తికైనా, పార్టికైనా కొలమానమని మా నాన్న చెప్పేవారు’’అని బైడెన్‌ అన్నారు. నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌కు గట్టి పోటీ ఇచ్చారని భావించిన హారిస్‌ చివరికి ఆయన చేతిలో భారీ తేడాతో ఓడటం తెలిసిందే. 

హారిస్‌ భవితవ్యం ఏమిటి? 
హారిస్‌ తన సొంత రాష్ట్రమైన కాలిఫోరి్నయా గవర్నర్‌ పదవికి పోటీ చేయాలని కొందరు డెమొక్రాట్లు కోరుతున్నారు. ఆమె మాత్రం తన భవిష్యత్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బైడెన్‌ జనవరి 20న అధ్యక్ష పదవి నుంచి వైదొలగనుండటం తెలిసిందే. అయినా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ అమెరికా సమాజంలో నెలకొన్న లోతైన విభేదాలను చక్కదిద్దేందుకు కృషి చేయాలనుకుంటున్నట్లు ఆయన సరదా వ్యాఖ్యలు చేశారు. ‘‘మీకందరికీ బ్యాడ్‌ న్యూస్‌ ఏమిటంటే నేనెక్కడికీ వెళ్లడం లేదు. ఇక్కడే ఉండాలనుకుంటున్నా’’అని నవ్వుతూ అన్నారు.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)