Breaking News

USA: ఎన్నికల్లో పోటీ.. బైడెన్‌ కీలక ప్రకటన

Published on Sat, 07/13/2024 - 09:23

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ త్వరలో జరిగే అధ్యక్ష ఎన్నికల బరిలోనుంచి తప్పుకోవాలన్న డిమాండ్‌ రోజురోజుకు ఎక్కవవుతోంది. సొంత పార్టీ డెమొక్రాట్లలోనే బైడెన్‌పై అసమ్మతి పెరుగుతోంది. ఇటీవల జరిగిన ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌లో బైడెన్‌పై రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌ పైచేయి సాధించినప్పటి నుంచి బైడెన్‌ అభ్యర్థిత్వంపై  చర్చ మొదలైంది.

ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల పోటీ అంశంపై బైడెన్‌ క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం(జులై 12) డెట్రాయిట్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో బైడెన్‌ మాట్లాడారు. అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తాను తప్పుకునేది లేదని స్పష్టం చేశారు. అమెరికాకు ట్రంప్‌ రూపంలో పెద్ద ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ‘రేసులో నేను పరిగెడుతున్నాను. 

అధ్యక్ష ఎన్నికల్లో మనం మళ్లీ గెలవబోతున్నాం. నేను పోటీలోనే ఉంటా. మీడియా నన్ను టార్గెట్‌ చేస్తోంది. నాకు నిజం ఎలా చెప్పాలో తెలుసు. తప్పేదో ఒప్పేదో నాకు తెలుసు, అమెరికన్లకు అధ్యక్షుడు కావాలి. నియంత కాదు. మళ్లీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో సంచలన నిర్ణయాలు తీసుకుంటాం. ఎన్నికల్లో భారీ మెజారిటీ వస్తేనే  ఇవి సాధ్యమవుతాయి’అని బైడెన్‌ తెలిపారు. ఈ ఏడాది నంబర్‌ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.  

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు