Breaking News

మళ్లీ తడబడ్డ బైడెన్‌.. ట్రంప్‌కు వైస్‌ ప్రెసిడెంట్‌ పదవి

Published on Fri, 07/12/2024 - 07:29

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నవంబర్‌లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలన్న డిమాండ్‌ రోజురోజుకు ఎక్కువవుతోంది. ప్రత్యర్థి, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌తో ఇటీవల జరిగిన ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌లో బైడెన్‌ వెనుకబడ్డ విషయం తెలిసిందే. దీంతో సొంత పార్టీ డెమొక్రాట్లలోనే బైడెన్‌ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలన్న డిమాండ్‌ మొదలైంది. 

ఈ క్రమంలో బైడెన్‌ తాజాగా మరోసారి తన వృద్ధాప్యాన్ని చాటుకున్నారు. వాషింగ్టన్‌లో తాజాగా జరిగిన మీడియా సమావేశంలో బైడెన్‌ పెద్ద పొరపాటే మాట్లాడారు. ఈసారి ఏకంగా వైస్‌ ప్రెసిడెంట్‌ కమలాహ్యారిస్‌, ప్రత్యర్థి ట్రంప్‌ పేరును కలిపేశారు.

వైస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ అని అన్నారు ‘వైస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌కు అధ్యక్ష పదవి చేపట్టే అన్ని అర్హతలున్నాయి. అందుకే నేను ఆమెను వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎంపిక  చేశాను’అని  కమలాహ్యారిస్‌ గురించి చెబుతూ ఆమె పేరుకు బదులు ట్రంప్‌ పేరు పలికారు.

దీంతో బైడెన్‌ మానసిక స్థితిపై మరోసారి చర్చ మొదలైంది. రిపబ్లికన్లు ఈ విషయమై సోషల్‌ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. బైడెన్‌ అధ్యక్ష పదవి పోటీ నుంచి తప్పుకోవాలన్న వాదనకు మరింత బలం చేకూరినట్లయింది. ఈ ఏడాది నవంబర్‌ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది పోరు జరగనుంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)