Breaking News

బెల్జియం అపార్ట్‌మెంట్‌లో మంటలు

Published on Thu, 07/02/2026 - 05:17

ఆంట్‌వెర్ప్‌: బెల్జియంలోని ఆంట్‌వెర్ప్‌ నగర శివారులోని ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. షెల్డర్‌ నది సమీపంలోని లింకెరోవర్‌ జిల్లా పరిధిలోని ఈ పది అంతస్తుల భవంతి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా బుధవారం ఉదయం 10 గంటలకు ఎనిమిదో అంతస్తులో అనూహ్యంగా హఠాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఈ భవంతిలోని 80 ఫ్లాట్‌లలో 200 మందికిపైగా నివసిస్తున్నారు.

ఎగసిపడుతున్న అగ్నికీలలు, దట్టంగా అలుముకున్న పొగతో భవనంలో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. భవంతిలోని పై అంతస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. ముఖ్యంగా పదో అంతస్తు దారుణంగా కాలిపోయింది. విషయం తెల్సి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని అగ్నికీలలను ఆర్పే ప్రయత్నంచేశారు.

అత్యంత ఎత్తులో మంటలు చెలరేగుతుండటంతో అగ్నికీలలను ఆర్పడం ఫైర్‌ విభాగ సిబ్బందికి సమస్యగా మారింది. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు. ఎనిమిదో అంతస్తులో దట్టంగా కమ్ముకున్న పొగ మధ్యలోంచి ఒకతను బయటకు వేలాడుతూ రక్షించండి అని అరుస్తున్న వీడియో సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సమయస్ఫూర్తితో ఆయన నెమ్మదిగా పక్కకు జరిగి వేరే కిటికీ ద్వారా బయటపడ్డారు.

#

Tags : 1

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)