Breaking News

ఎట్టకేలకు కమలా హారిస్‌కు మద్దతు ప్రకటించిన ఒబామా

Published on Fri, 07/26/2024 - 15:37

అమెరికా ఉపాధ్యక్షురాలు,  డెమొక్రాటిక్ అభ్య‌ర్థి క‌మ‌లా హారిస్‌కు.. మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్‌ ఒమాబా మ‌ద్ద‌తు ప్రకటించారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా కమలా హారిస్‌ను వారు ఆమోదించారు. న స్నేహితురాలు హారీస్‌ అమెరికాకు గొప్ప అధ్యక్షురాలు అవుతుందని భావిస్తున్నామని, ఆమెకు మా పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. 

ఈమేరకు ట్వీట్‌ చేశారు. ‘అధ్యక్ష ఎన్నికల్లో నా స్నేహితురాలు యూనైటెడ్‌ స్టేట్స్‌కు అధ్బుతమైన అధ్యక్షురాలిగా అవుతుంది. రెండు రోజుల క్రితం కమలా హ్యారిస్‌కు మేము ఫోన్‌ చేశాం. మిచెల్‌, నేను ఆమెతో మాట్లాడాం. తనకు మా పూర్తి మద్దతు ఉందని ఆమెకు చెప్పాము. ఈ క్లిష్టమైన సమయంలో నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఆమె గెలుపొందేందుకు మేము చేయగలిగినదంతా చేస్తాం.  నీ పట్ల మాకు గర్వంగా ఉంది. నువ్వు చరిత్ర సృష్టిస్తామని తెలుసు’ అని  అని బరాక్ ఒబామా  ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు.

ఇక  ఈ న‌వంబ‌ర్‌లో జ‌ర‌గ‌బోయే అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా క‌మ‌లా హ్యారిస్ పోటీ ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. రేసు నుంచి త‌ప్పుకున్న అధ్య‌క్షుడు బైడెన్‌.. త‌న స్థానంలో క‌మ‌లా హ్యారిస్‌ను ప్ర‌తిపాదించారు. అయితే క‌మ‌లా హ్యారిస్ విష‌యంలో డెమోక్ర‌టిక్ నేత‌లు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా త‌న మ‌ద్ద‌తును తెలప‌లేదు. అయితే ఇవాళ ఒబామా దంప‌తులు .. క‌మ‌లా హారిస్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)