Breaking News

బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. సింగర్‌ షోపై మూక దాడి

Published on Sat, 12/27/2025 - 10:28

ఢాకా: బంగ్లాదేశ్‌లో పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. వరుస దాడి ఘటనల కారణంగా ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లో ప్రముఖ రాక్‌స్టార్‌ కాన్సర్ట్‌పై మూక దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 20 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇంతకీ ఏం జరిగిందంటే.. బంగ్లాదేశ్‌లోని ఫరీదాపూర్‌లో ఓ పాఠశాల 185వ వార్షికోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ గాయకుడు జేమ్స్‌ కాన్సర్ట్‌ను ఏర్పాటుచేశారు. ఈ కార్య​క్రమంలో పాల్గొనేందుకు పాఠశాల పూర్వ విద్యార్థులతో సహా వేలాది మంది అక్కడికి వచ్చారు. అయితే, ఈ కాన్సర్ట్‌ ప్రారంభానికి ముందు(రాత్రి తొమ్మిది గంటల సమయంలో).. ఉన్నట్టుండి ఆందోళనకారులు వేదిక వద్దకు దూసుకొచ్చారు. దీంతో, వారిని భద్రతా సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ.. సాధ్యం కాలేదు. కాన్సర్ట్‌కు వచ్చిన వారిపై ఆందోళనకారులు రాళ్లు, ఇటుకలతో దాడి చేశారు.

కాగా, ఆందోళనకారుల దాడి నుంచి గాయకుడు జేమ్స్‌ తృటిలో తప్పించుకున్నారు. ఉద్రిక్తతలు మొదలవగానే భద్రతా సిబ్బంది ఆయన్ను అక్కడినుంచి తరలించారు. కానీ, మూక దాడిలో పలువురు పాఠశాల విద్యార్థులు గాయపడ్డారు. దీంతో ఈ కార్యక్రమం రణరంగాన్ని తలపించింది. దాడి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అనంతరం, భద్రతా కారణాల రీత్యా కాన్సర్ట్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ దాడిలో 20 మంది గాయపడినట్లు తెలుస్తోంది. దాడికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)