Breaking News

బంగ్లా సంక్షోభం: పార్లమెంట్‌ రద్దు

Published on Tue, 08/06/2024 - 15:16

ఢాకా: బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో దేశ పార్లమెంట్‌ రద్దు అయింది. ఈ మేరకు అధ్యక్షుడు మహ్మద్ షాహబుద్దీన్  ఓ ప్రకటన విడుదల చేశారు. రిజర్వేషన్ల కోటా నిరసనల నేపథ్యంలో ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా చేసి భారత్‌ చేరుకున్నారు. అనంతరం ఆర్మీ నియంత్రణలోకి వెళ్లిన బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. కొత్త ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడిగా నోబెల్‌ గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా చర్చలు జరుపుతున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. 

చదవండి:  బంగ్లాదేశ్‌ పరిస్థితులను గమనిస్తున్నాం: కేంద్ర మంత్రి జైశంకర్‌

నూతన ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడిగా మహ్మమద్‌ యూనస్‌ను నియమించాలంటూ నిరసనలు చేస్తున్న విద్యార్థి సంఘాల ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనిపై ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకార్‌ ఉజ్‌ జమాన్‌ నిరసన  విద్యార్థి నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 

బంగ్లాదేశ్‌ ప్రధాని పదవికి నిన్న రాజీనామా చేసిన షేక్‌ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఉన్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన వెంటనే నిన్న భారత్‌కు చేరుకున్నారు షేక్‌ హసీనా. ఘజియాబాద్‌ సమీపంలోని హిండన్‌ ఎయిర్‌బేస్‌కు సైనిక విమానంలో వచ్చిన షేక్‌ హసీనా లండన్‌ వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. హసీనా వెంట ఆమె సోదరి హసీనా కూడా ఉన్నారు. ప్రస్తుతానికి రహస్య ప్రదేశంలో ఉన్న హసీనా బ్రిటన్‌ సర్కార్‌ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అయితే బ్రిటన్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆదేశం నుంచి అనుమతి రాగానే లండన్‌ బయలు దేరి వెళ్లే అవకాశం ఉంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)