Breaking News

బంగ్లాలో దారుణం.. హిందూ యువకుడిని చంపి ఆపై..

Published on Fri, 12/19/2025 - 16:32

బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు నానాటీకీ పెరిగిపోతున్నాయి. భారత వ్యతిరేక నాయకుడు ఉస్మాన్ హాదీ మరణం నేపథ్యంలో అక్కడి అల్లరి మూకలు రెచ్చిపోయాయు. గురువారం రాత్రి మైమెన్ సింగ్ అనే జిల్లాలో దైవదూషణ చేశాడనే ఆరోపణలతో ఒక హిందూ యువకుడిని అక్కడి అల్లరిమూకలు తీవ్రంగా కొట్టి చంపారు.

బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి, హింస తీవ్రస్థాయికి చేరుకుంది. భారత వ్యతిరేఖ భావజాలం గల నేత షరీప్ ఉస్మాన్ హాదిని డిసెంబర్‌ 12న గుర్తు తెలియని వ్యక్తులు తలపై కాల్చారు. దీంతో అతనిని చికిత్స నిమిత్తం సింగపూర్‌ తరలించారు. కాగా షరీప్ ఉస్మాన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో బంగ్లాలో మరోసారి హింస చేలరేగింది. ప్రభుత్వ వైఫల్యంతోనే ఉస్మాన్ మృతిచెందారని ఆరోపిస్తూ ఆందోళనకారులు ఢాకాలో పెద్దఎత్తున నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఓ హిందూ యువకుడిని కొట్టిచంపారు.

ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ "ఒక అల్లరిమూకల సమూహం గురువారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఒక వ్యక్తిని పట్టుకొని కొట్టి చంపారు. అనంతరం అతనిని కాల్చివేశారు. మంటలలో వేసే ముందు నిరసన కారులు అతని శరీరాన్ని చెట్టుకు పట్టుకొని వ్రేలాడదీశారు." అని అధికారి అన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని అల్లరి మూకలను చెదరగొట్టి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.

అనంతరం పోస్టుమార్టమ్‌ నిమిత్తం మైమెన్ మెడికల్ కాలేజ్‌కి తరలించామని తెలిపారు. ఈ ఘటన భాలుకా ఉప జిల్లా  స్క్వేర్ మాస్టర్‌ బారిలో జరిగిందని తెలిపారు. బాధితుడు స్థానికంగా ఓ వస్త్రకర్మాగారంలో పనిచేస్తున్నారని అతని పేరు దీపు చంద్రదాస్ అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మృతుడి బంధువులకోసం వెతుకుతున్నామన్నారు. కాగా ఈ ఘటనపై ఇప్పటివరకూ ఎటువంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. మృతుడి బంధువులు వచ్చి కేసు నమోదు చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. బంగ్లాదేశ్‌లో ఇటువంటి హింసకు తావులేదని పేర్కొంది. కాగా బంగ్లాలో ఇటీవల మైనార్టీలపై దాడులు విపరీతంగా పెరిగాయి. ఈ ఏడాది జనవరి-జూన్ ప్రాంతంలో ఆ దేశంలో మైనార్టీలపై దాడుల ఘటనలు 258 జరిగాయి. ఈ దాడులలో 27 మంది మృతిచెందగా, 20 పైగా మహిళలు అత్యాచారానికి గురయ్యారు. 59 దేవాలయాలపై దాడులు జరిగాయి.

 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు