Breaking News

చిన్మయ్‌ కృష్ణదాస్‌పై కేసుల మీద కేసులు.. తాజాగా

Published on Mon, 12/09/2024 - 09:11

ఢాకా : బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్‌ కృష్ణదాస్‌పై పదుల సంఖ్యలో కేసులు నమోదవతున్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్‌లోని పలు స్టేషన్‌లలో కేసులు నమోదు కాగా.. తాజాగా చిన్మయ్‌తో పాటు ఆయన వందలాది మంది అనుచరులపై కేసులు నమోదయ్యాయి.  

బంగ్లాదేశ్ స్థానిక మీడియా కథనాల ప్రకారం.. బంగ్లాదేశ్‌లోని ఓ మతపరమైన సంస్థ కార్యకర్త చిన్మయ్‌ కృష్ణదాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో నవంబర్ 26న చిట్టగాంగ్ కోర్టు ప్రాంగణంలో సంప్రదాయ దుస్తులు ధరించినందుకు చిన్మయ్‌ కృష్ణదాస్‌, ఆయన అనుచరులు తనపై దాడి చేశారని, ఆ దాడిలో తన చేయి, తలకు తీవ్రగాయాలైనట్లు పేర్కొన్నారు. దాడిలో తీవ్ర గాయాలు కావడంతో నాటి నుంచి చికిత్స పొందుతూ తాజాగా డిశ్చార్జ్‌ కావడంతో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ వెలుగులోకి వచ్చిన బంగ్లాదేశ్‌ మీడియా కథనాలు హైలెట్‌ చేశాయి.  

అంతకు ముందు చిన్మయ్‌ కృష్ణదాస్‌ అరెస్ట్‌ నేపథ్యంలో పలు ఆందోళనలు జరిగాయి. ఆ ఆందోళనపై  నవంబర్ 27న కొత్వాలి పోలిస్‌ స్టేషన్‌లో మూడు కేసులు, డిసెంబర్ 3న రంగం సినిమా థియేటర్‌ సమీపంలో పలువురు ఓ పార్టీ కార్యకర్తలు, ఇస్కాన్‌ సభ్యులు తమపై దాడి చేయడంతో స్థానిక పోలీసులు కేసులు నమోదు చేశారు.  

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్‌ కృష్ణదాస్‌ గత నెలలో అక్కడ జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈక్రమంలో బంగ్లాదేశ్‌ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఢాకా విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈనేపథ్యంలో చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)