Breaking News

హసీనా రూ. 41 వేల కోట్ల లంచం తీసుకున్నారు

Published on Wed, 12/25/2024 - 05:29

ఢాకా: బంగ్లాదేశ్‌లోని ఏకైక అణు విద్యుత్‌ కర్మాగారం నిర్మాణంలో పదవీచ్యుత ప్రధాని షేక్‌ హసీనా రూ.41.46 వేల కోట్ల మేర లంచం తీసుకున్నారని ఆపద్ధర్మ ప్రభుత్వం ఆరోపించింది. దీనిపై అవినీతి నిరోధక విభాగం తాజాగా విచారణ చేపట్టినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. రూప్‌పూర్‌ అణు ప్లాంట్‌ డిజైన్, నిర్మాణ బాధ్యతలను రష్యా ప్రభుత్వ రంగ సంస్థ రోసటోమ్‌ తీసుకోగా, నిర్మాణ పనులను భారతీయ కంపెనీలు చేపట్టాయి.

రూప్‌పూర్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ నుంచి షేక్‌ హసీనా, ఆమె కుమారుడు జాయ్, బంధువు తులిప్‌ సిదిఖీలు మలేసియా బ్యాంకుకు చేసిన రూ.41.46 వేల కోట్ల బదిలీని అక్రమంగా ఎందుకు ప్రకటించలేదంటూ రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్‌ హైకోర్టు దేశ యాంటీ కరప్షన్‌ కమిషన్‌(ఏసీసీ)ను ప్రశ్నించిన నేపథ్యంలోనే ఈ దర్యాప్తు చేపట్టినట్లు మీడియా తెలిపింది.

నేషనల్‌ డెమోక్రాటిక్‌ మూవ్‌మెంట్‌(ఎన్‌డీఎం) చైర్మన్‌ బాబీ హజాజ్‌ అవినీతి జరిగిందంటూ మొదటిసారిగా ఆరోపించారు. రూప్‌పూర్‌ అణు ప్లాంట్‌ నిర్మాణంలో అవినీతి అంటూ వచి్చన ఆరోపణలను రష్యా ప్రభుత్వ సంస్థ రోసటోమ్‌ తీవ్రంగా ఖండించింది. షేక్‌ హసీనా, సోదరి రెహానాతోపాటు ప్రస్తుతం భారత్‌లో ఉండగా, ఆమె కుమారుడు జాయ్‌ అమెరికాలో ఉంటున్నారు. వీరి బంధువు తులిప్‌ సిద్దిఖీ బ్రిటన్‌ ఎంపీగా వ్యవహరిస్తున్నారు.

బంగ్లాదేశ్‌లో అల్లర్లు, హింసాత్మక ఘటనలపైనా ఆపద్ధర్మ ప్రభుత్వం హసీనాతోపాటు ఆమె కేబినెట్‌ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులపైనా జన హననం కేసులు నమోదయ్యాయి. ఆమెను అప్పగించాలంటూ రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్‌లోని ఆపద్ధర్మ ప్రభుత్వం భారత్‌ను అధికారికంగా కోరడం తెలిసిందే.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)