Bangladesh: హిందువుల పూజలపై ఆంక్షలు

Published on Thu, 09/12/2024 - 09:38

ఢాకా: బంగ్లాదేశ్‌లో అధికారం మారిన తర్వాత, అక్కడి హిందువులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హిందువుల పూజల విషయంలో ఆంక్షలు విధిస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.

దీని ప్రకారం బంగ్లాదేశ్‌లోని హిందువులు ఇకపై ముస్లింలు నమాజ్‌ చేసే సమయంలో పూజలు చేయకూడదు. అలాగే ఆ సమయంలో భజనలు చేయడం, వినడం, లౌడ్‌ స్పీకర్లు వినియోగించడం లాంటి పనులు చేయకూడదు. ఈ  ఉత్తర్వులను తాత్కాలిక ప్రభుత్వ హోం వ్యవహారాల సలహాదారు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ జహంగీర్ ఆలం చౌదరి జారీ చేశారు.

ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే, పోలీసులు ఎలాంటి వారెంట్ లేకుండా వారిని అరెస్టు చేస్తారని బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ  ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. బంగ్లాదేశ్‌లో అధికారం మారినప్పటి నుంచి ఇప్పటివరకూ 300 హిందూ కుటుంబాలు, వారి ఇళ్లపై దాడులు జరిగాయి. హిందువులపై మూక హత్యలు కూడా చోటుచేసుకున్నాయి. పదికి పైగా హిందూ దేవాలయాల్లో విధ్వంసం, దహనాలు జరిగాయి. ఇదేవిధంగా 49 మంది హిందూ ఉపాధ్యాయుల చేత బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఇప్పుడు ఈ కొత్త ఉత్తర్వుల తర్వాత బంగ్లాదేశ్‌లోని హిందువులు ప్రశాంతంగా పూజలు కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. 

ఇది కూడా చదవండి: NCPCR: మదర్సాల్లో బాలల హక్కుల ఉల్లంఘన 

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)