Breaking News

Bangladesh: ‘అవన్నీ ప్రభుత్వ హత్యలే’.. దడపుట్టిస్తున్న ఐక్యరాజ్యసమితి రిపోర్టు

Published on Thu, 02/13/2025 - 11:19

బంగ్లాదేశ్‌లో గత ఏడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమం ఎగసిపడింది. అనంతరం జరిగిన పరిణామాలపై తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ ఒక నివేదికను వెలువరించింది. నాడు చెలరేగిన హింసలో 1,400 మంది హతమయ్యారని ఆ నివేదిక బయటపెట్టింది. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని పరోక్షంగా పేర్కొంది. నాడు బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న మానవహక్కుల ఉల్లంఘనల ఉదంతాలను కూడా ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం ఆ నివేదికలో తెలియజేసింది.

బంగ్లాదేశ్‌లో 2024లో షేక్‌ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. నాటి షేక్ హసీనా ప్రభుత్వం.. నేటి మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వాల కాలంలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలను ఈ నివేదికలో వివరంగా పొందుపరిచారు.
2024 విద్యార్థి ఉద్యమంలో సుమారు 1,400 మంది హతమయ్యారని నివేదిక పేర్కొంది. భద్రతా దళాలు చిన్నారులతో సహా పలువురు నిరసనకారులను కాల్చిచంపాయని తెలిపింది.

తిరుగుబాటు తొలి రోజుల్లో షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం 150 మంది మరణాలను మాత్రమే నిర్ధారించింది. అయితే ఈ నివేదికలోని వివరాల ప్రకారం వందలాదిగా సాగిన చట్టవిరుద్ధ హత్యలు, ఏకపక్ష అరెస్టులు, నిర్బంధాలు మొదలైనవన్నీ షేక్ హసీనా ప్రభుత్వంతో పాటు భద్రతా అధికారుల సహకారంతోనే జరిగాయని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్‌ ఈ నివేదికలో పేర్కొంది.

ముహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం  కూడా మతపరమైన మైనారిటీలపై హింసను ప్రోత్సహిస్తున్నదని ఆ నివేదిక ఆరోపించింది. మహిళలు వారి నిరసనను వ్యక్తం చేయకుండా నిరోధించేందుకు వారిపై శారీరక దాడి, అత్యాచారం చేస్తామని పోలీసులు బెదిరించారని కూడా నివేదిక పేర్కొంది. నిరసనలను అణిచివేసే నెపంతో రాజకీయ నేతలు, భద్రతా అధికారులు ఉద్దేశపూర్వకంగా చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడ్డారని మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ పేర్కొన్నారు. విద్యార్థి నేత, అమరవీరుడు అబూ సయీద్ హత్య కూడా ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ఆ నివేదిక పేర్కొంది.

ఇది కూడా చదవండి: మళ్లీ పాక్‌ సరిహద్దు ఉల్లంఘన.. బుద్ధి చెప్పిన భారత్‌

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?