Breaking News

బలూచ్‌ ప్రజలపై పాక్‌ సర్కార్‌ దౌర్జన్యం

Published on Mon, 03/09/2026 - 12:17

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లోని షహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం బలూచ్‌ ప్రజల అణచివేతకు మళ్లీ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా బలూచ్ ప్రజల జీవనాధారంపై సర్కార్‌ దెబ్బకొట్టింది. వారి జీవనాధారమైన ఇంధనాన్ని కాల్చివేసింది. దీంతో, ఈ ఘటనను బలూచ్ యక్జెహ్తీ కమిటీ తీవ్రంగా పరిగణించింది. దీంతో పాక్‌ ప్రభుత్వ చర్యను ఖండించింది.

బలూచ్ ప్రజలు దశాబ్దాలుగా పాకిస్తాన్ ప్రభుత్వ విధానాల వల్ల ఆర్థిక, సామాజిక అణచివేతను ఎదుర్కొంటున్నారు. గ్వాదర్, మక్రాన్ వంటి ప్రాంతాల్లో  బలూచ్‌ ప్రజలు.. సరిహద్దు వ్యాపారం, ఇంధన విక్రయం వంటి చిన్నచిన్న జీవనాధారాలపై ఆధారపడుతున్నారు. కానీ, పాకిస్తాన్ సంస్థలు వీటిని తరచుగా నేరంగా పరిగణించి అణచివేస్తున్నాయి. తాజాగా గ్వాదర్‌లోని మోచెన్ కపర్, కుంటాని ప్రాంతంలో అక్కడి ప్రజల జీవనాధారమైన ఇంధనాన్ని సర్కార్‌కు చెందిన కొన్ని సంస్థలు కాల్చివేసింది. దీంతో, బలూచ్ యక్జెహ్తీ కమిటీ స్పందించింది. ఈ చర్యను తీవ్రంగా ఖండించింది.

ఈ సందర్భంగా కేవలం ప్రకటనలు కాకుండా, మానవ హక్కుల సంస్థలు పాకిస్తాన్‌ను బాధ్యత వహించేలా ప్రాయోగిక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బలూచ్ ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు, ఆర్థిక అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ప్రతీ చిన్న జీవన ప్రయత్నాన్ని కూడా నేరంగా పరిగణించడం, బలూచ్ ప్రజలను వలస పాలనలో ఉన్నట్టుగా ప్రభుత్వం చూపిస్తోంది అంటూ షహబాజ్‌ సర్కార్‌పై మండిపడింది. అలాగే, బలూచ్ ప్రజలు తమ జీవనాధారాన్ని కాపాడుకోవడానికి పోరాడుతూనే ఉన్నారు. ఇంధనాన్ని కాల్చివేయడం వంటి చర్యలు, వారి ఆర్థిక హక్కులను మాత్రమే కాకుండా, మానవ హక్కులను కూడా ఉల్లంఘిస్తున్నారు. ఈ సంఘటన బలూచ్ ప్రజలపై జరుగుతున్న దీర్ఘకాలిక అణచివేతకు మరో ఉదాహరణగా నిలిచింది అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)