Breaking News

పాకిస్తాన్‌లో దారుణం.. చైనీయులపై కాల్పులు..

Published on Sun, 08/13/2023 - 19:09

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్తాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాక్‌లో ఉన్న చైనా ఇంజినీర్ల వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. కాగా, ఈ ఘటనలో చైనా ఇంజినీర్లు చనిపోయినట్టు.. భద్రతా సిబ్బంది ఒకరు గాయపడినట్లు సమాచారం. ఇక, దాడికి పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులను వారు మట్టుబెట్టారు. 

వివరాల ప్రకారం.. బలూచిస్తాన్‌లోని గ్వాదర్‌ వద్ద చైనాకు చెందిన ఇంజినీర్ల వాహనాలపై ఉగ్రదాడి జరిగింది. స్థానికంగా ఉన్న ఫకీర్‌ కాలనీ వంతెనపైకి చైనా ఇంజినీర్లకు చెందిన ఏడు వాహనాలు చేరుకోగానే రెబల్స్‌ కాల్పులు జరిపారు. దాదాపు రెండు గంటల పాటు కాల్పులు జరిగాయి. ఈ దాడికి తాము బాధ్యత వహిస్తున్నట్లు బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన మజీద్‌ బ్రిగేడ్‌ పేరిట ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక, ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక చైనా ఇంజినీర్లు చనిపోయినట్టు తెలుస్తోంది. భద్రతా సిబ్బంది ఒకరు గాయపడినట్లు అక్కడి మీడియా పేర్కొంది.

చైనా అలర్ట్‌..
మరోవైపు.. చైనా భద్రతా సిబ్బంది ఎదురు దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌ స్వాతంత్ర్య దినోత్సవం ముందురోజు(ఆగస్టు 14)న ఉగ్రవాదుల దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ దాడితో పాక్‌లో ఉ‍న్న చైనా దౌత్యకార్యాలయం అప్రమత్తమైపోయింది. పాక్‌లోని బలూచిస్తాన్‌, సింధ్‌ ప్రావిన్స్‌ల్లోని చైనీయులు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇళ్లలోనే ఉండిపోవాలని సూచించింది. కాగా, ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌లో చైనీయులపై దాడులు ఎక్కువయ్యాయి. గ్వాదర్‌ పోర్టుపై చైనా పెత్తనం చేయడంతో స్థానికులు కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దాడులు జరగడం గమనార్హం. 

ఇది కూడా చదవండి: దేవాలయంపై దాడి.. గోడలపై ఖలిస్థానీల నినాదాలు..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)