Breaking News

పాకిస్తాన్‌ ఆర్మీ కాన్వాయ్‌పై దాడి.. పది మంది సైనికులు మృతి

Published on Sat, 04/26/2025 - 11:19

ఢిల్లీ: పాకిస్తాన్‌ ఆర్మీకి మరోసారి బిగ్‌ షాక్‌ తగిలింది. బెలుచిస్తాన్‌లో పాక్‌ ఆర్మీపై దాడి జరిగింది. పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(Baloch Liberation Army-BLA)దాడి చేసింది. ఈ ఘటనలో 10 మంది పాకిస్తాన్ సైనికులు మృతిచెందినట్టు సమాచారం.

వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌కు చెందిన బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.  పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై బెలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్‌   దాడి చేశారు. ఈ దాడిలో కనీసం 10 మంది పాకిస్తాన్ సైనికులు మృతిచెందినట్టు సమాచారం. ఆర్మీ కాన్వాయ్‌లోని ఒక వాహనం పూర్తిగా ధ్వంసమైపోయింది. కాగా, ఇది బెలూచ్ విప్లవకారుల తాజా యుద్ధ ప్రకటనగా చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీఎల్‌ఏ స్వయంగా విడుదల చేసింది. ఈ వీడియోలో పేలుళ్లు, కాల్పుల శబ్దాలు, నాశనమైన పాక్ ఆర్మీ వాహనాలు కనిపిస్తున్నాయి.

ఇక, ఈ దాడితో పాటు బీఎల్‌ఏ మరోసారి పాకిస్తాన్ ఆర్మీకి భారీ హెచ్చరిక జారీ చేసింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. పాక్ ఆర్మీకి ఇకపై భద్రత ఉండదు. మేం మా హక్కుల కోసం చివరి వరకు పోరాడతాం.. అంటూ వారు ప్రకటించారు. అయితే, పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ ఘటన తర్వాత సైనిక వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. బెలూచిస్థాన్‌లో భద్రతా వ్యవస్థ మరింత కఠినంగా అమలు చేయబోతున్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా.. ఎన్నో దశాబ్దాలుగా స్వతంత్ర బెలూచిస్థాన్ కోసం బీఎల్‌ఏ పోరాడుతోంది. ఈ క్రమంలో పాక్ ప్రభుత్వం తమ హక్కులు దూరం చేస్తున్నదని ఆరోపిస్తూ వరుస దాడులకు పాల్పడుతోంది. గత కొన్ని నెలలుగా BLA కార్యకలాపాలు మరింత ఉధృతంగా మారాయి. ఈ దాడి తర్వాత పాక్‌లో పరిస్థితి అత్యంత అస్థిరంగా మారింది. తాజా దాడి నేపథ్యంలో ప్రజల్లో భయం, భద్రతా వర్గాల్లో ఆందోళన నెలకొంది.

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)