Breaking News

దడ పుట్టిస్తున్న కొత్త బ్యాక్టీరియా.. సోకితే రెండు రోజుల్లో మృతి?

Published on Sun, 06/16/2024 - 08:48

జపాన్‌లో అరుదైన వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. మనిషి మాంసాన్ని తినే బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ బాక్టీరియా  ప్రాణాంతకమని, దీని బారిన పడిన బాధితులు రెండు రోజుల్లో మృతి చెందే అవకాశం ఉన్నదని జపాన్‌ వైద్య నిపుణులు చెబుతున్నారు.

జపాన్‌లో కరోనా పీరియడ్ ఆంక్షలు సడలించిన అనంతరం ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతూ వస్తోంది. వైద్యుల అంచనా ప్రకారం ఈ వ్యాధి మనిషిని 48 గంటల్లో మృత్యు ఒడికి చేరుస్తుంది. ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధిని ‘స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్’ (ఎస్‌టీఎస్‌ఎస్‌) అని అంటారు.

జపాన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ తెలిపిన వివరాల ప్రకారం 2024, జూన్ 2 నాటికి ఈ వ్యాధి కేసులు 977కి చేరుకున్నాయి. గతేడాది 941 కేసులు నమోదయ్యాయి. ఈ ఇన్స్టిట్యూట్  1999 నుంచి ఈ వ్యాధికి సంబంధించిన రికార్డులను భద్రపరుస్తోంది.

ఈ వ్యాధి సోకినప్పుడు గొంతు నొప్పి మొదలవుతుంది. అలాగే శరీరంలోని వివిధ అవయవాల్లో వాపు, నొప్పి జ్వరం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఇది శ్వాస సమస్యలు, అవయవ వైఫల్యానికి దారితీసి చివరికి బాధితుడిని మృత్యు ఒడికి చేరుస్తుంది. 50 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధి వచ్చే ప్రమాదం అధికంగా ఉంటున్నదని పలు పరిశోధనల్లో తేలింది.

ఈ వ్యాధి గురించి టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్శిటీకి చెందిన అంటు వ్యాధుల ప్రొఫెసర్ కెన్ కికుచి మాట్లాడుతూ ఈ వ్యాధి సోకినప్పుడు మరణం 48 గంటల్లో సంభవించే అవకాశం ఉన్నదన్నారు.  జపాన్‌లో ఈ ఏడాది చివరినాటికి ఈ కేసుల సంఖ్య 2,500కి చేరుకోవచ్చని కికుచి తెలిపారు.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)