Breaking News

ఇక నన్నెవరూ చూడలేరు! 

Published on Mon, 07/07/2025 - 05:08

పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తననెవరూ చూడటం లేదనుకుంటుందట. అలాంటి అమాయకత్వమే ఈ ఏనుగు పిల్లది. రాత్రిపూట ఓ చేలో చొరబడిన బుజ్జి ఏనుగు చెరుకు తింటూ ఉండిపోయింది. అంతలోనే ఎవరో వస్తున్నట్టు అలికిడి వినపడటంతో దాక్కోవాలనుకుంది. అదెదో పొదల్లోనో, చెట్టుమాటునో కాదు. దానికి సమీపంలో విద్యుత్‌ స్తంభం కనిపించింది. వెంటనే వెళ్లి దాని వెనుక దాక్కుంది. అంతేకాదు.. ఇక తానెవరికీ కనబడనని అనుకుంది. 

దాక్కునేందుకు జంబో కిడ్‌ చేసిన విఫల ప్రయత్నం వాహనంలో ఉన్నవారికి నవ్వు తెప్పించింది. వెంటనే క్లిక్‌ మనిపించి.. ఆ చిత్రాన్ని సోషల్‌ మీడియాలో పెట్టారు. జరిగిన విషయాన్నంతా జోడించారు. ఆ పిల్ల ఏనుగు అమాయక చర్య ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఫొటో చూసినవారు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో జరిగింది.  

థాయ్‌లాండ్‌లో కనిపించిన ఈ ఏనుగు భారతీయ సంతతికి చెందింది. ఆసియా ఏనుగుల ఉపజాతి. వాటికున్న చిన్న చెవులే.. ఆఫ్రికన్‌ ఏనుగుల నుంచి వీటిని వేరుగా చూపిస్తాయి. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో 4,422 అడవి ఏనుగులు ఉన్నాయని అంచనా. వాటిలో సగం ఐదు అటవీ ప్రాంతాలలో నివసిస్తున్నాయి. 

ఇటీవల కాలంలో వాటి జనాభా పెరగడం, అటవీ ప్రాంతాలు తరుగుతుండటంతో ప్రమాదకరంగా మారింది. గత సంవత్సరం, ఏనుగులకు సంబంధించిన 4,700 ప్రమాద సంఘటనలు నమోదయ్యాయి. వాటి కారణంగా 19 మంది మరణించారు. 22 మంది గాయపడ్డారు. వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయని 594, ఆస్తి నష్టం కలిగించాయని 67 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ఏనుగులను చంపడం కఠినమైన నేరం. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)