అతడు సముద్రాన్ని జయించాడు.. 60 రోజుల పాటు ఒక్కడే..   

Published on Mon, 07/17/2023 - 12:15

సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన ఓ నావికుడు రోజుల తరబడి సముద్రంలో ఒంటరిగా గడిపాడు. తన పడవ ప్రయాణం మధ్యలో చిక్కుకుపోవడంతో సముద్రంలో దిక్కుతోచని స్థితిలో గుండెధైర్యంతో కాలాన్ని నెట్టుకొచ్చాడు. పడవలో అతనికి తోడుగా అతని పెంపుడు కుక్క మాత్రమే ఉంది. రెండు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మెక్సికో ఓడ ఒకటి అటుగా రావడంతో వారు అతనిని గుర్తించి రక్షించారు. 

ఆస్ట్రేలియా నావికుడు టిమ్ షాడోక్ తన పెంపుడు కుక్క బెల్లాతో కలిసి మెక్సికో తీరంలోని లా పాజ్ నగరం నుండి 6000 కిలోమీటర్లు ప్రయాణించి ఫ్రెంచ్ పాలినీషియా చేరుకునేందుకు ప్రయాణమయ్యాడు. కానీ దురదృష్టకర పరిస్థితుల్లో పడవలో సాంకేతిక లోపం తలెత్తి  టిమ్ పసిఫిక్ మహాసముద్రం మధ్యలో చిక్కుకుపోయాడు. చుట్టూ నీరు, అలల హోరు తప్ప మరొకటి కానరాక రెండు నెలలపాటు సాగరం మధ్యలో అలమటించాడు. 

సముద్రం అలల తాకిడికి పడవలోని ఎలక్ట్రానిక్ సామాగ్రి బాగా దెబ్బతింది. సరైన ఆహారం లేక ఆకలికి పచ్చి చేపలను తింటూ, దాహానికి వర్షపు నీళ్లను తాగుతూ ఎలాగోలా తనతో పాటు తన కుక్క ప్రాణాలను కూడా నిలబెట్టుకున్నాడు.  

   

మెక్సికోకు చెందిన ఒక పెద్ద ఓడ వారిని గుర్తించి రక్షించింది. అప్పటికే టిమ్ షాడోక్ బాగా గడ్డం పెరిగి, బక్కచిక్కి గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. సహాయక బృందాలు అతడిని రక్షించిన తర్వాత తన పెంపుడు కుక్కతో తిరిగి మెక్సికో చేరుకుని వైద్యపరీక్షలు చేయించుకుని సరైన ఆహారం తీసుకోవాలని అన్నాడు.

ఇది కూడా చదవండి: లోదుస్తుల్లో పాములు.. ఎయిర్ పోర్టులో పట్టుబడిన మహిళ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)