Breaking News

లైఫ్‌ బోర్‌ కొడుతోంది, ఇలా బతకలేను.. ట్రక్కు డ్రైవర్‌గా మారిన సీఈఓ

Published on Fri, 07/14/2023 - 15:36

జీవితంలో మనీ ఉంటే చాలని కొందరు భావిస్తారు. అందుకోసం రాత్రింబవళ్లు శ్రమిస్తూ కోట్లు వెనకేసుకుంటుంటారు. ఇంకొందరు పైసలు మాత్రమే కాదు ప్రశాంతత కూడా కావాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఆస్తులు, బంగ్లాలు, హోదాలు వద్దని సాధరణ జీవితంవైప మొగ్గు చూపుతుంటారు. ఇలా ఎవరికి నచ్చిన దారిలో వాళ్లు తమ గమనాన్ని నిర్ణయించుకుంటుంటారు. తాజాగా ఓ సంస్థ సీఈవో తన లైఫ్‌ బోరింగ్‌గా ఉందని.. ఆ జీవితానికి స్వస్తి పలుకుతూ ట్రక్కు డ్రైవర్‌గా మారాడు. వినడానికి ఆశ్చర్యం కలిగించినా ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.

వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియాకు చెందిన గ్రెగ్‌ రాస్‌ మొదట్లో కార్ల సంస్థలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిని ప్రారంభించాడు. అంతా బాగానే సాగుతోంది, జీతం మంచిగానే సంపాదిస్తు‍న్నాడు. అయితే అతని జీవితంలో ఏదో కోల్పోయానన్న అసంతృప్తి మాత్రం పేరుకుపోయింది. అయితే కుటుంబం గురించి ఆలోచించి ఆ ఉద్యోగాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. కాలక్రమంలో ఆయన ఓ సినిమా హాళ్ల సంస్థకు సీఈవోగా ఎదిగారు. హోదా, ఆస్తులు, సకల సౌకర్యాలు.. ఇలా ఎన్ని సాధించినా.. ఆయన మనసులో మాత్రం ఆ వెలితి అలానే ఉండిపోయింది.

దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి సాధారణంగా, ఒత్తిడికి దూరంగా ప్రశాంతమైన జీవితం గడపాలనుకున్నాడు. అప్పటికే గ్రెగ్‌కు ఆరు పదులు నిండాయి. అయినా వయసుకు మనసుకు సంబంధం లేదని గ్రహించాడు. ఉద్యోగాన్ని వదిలి ఓ రవాణా కంపెనీలో ట్రక్కు డ్రైవర్‌గా చేరి హ్యాపీగా జీవిస్తున్నాడు. ప్రస్తుతం గ్రెగ్‌కు 72 ఏళ్లు. 20 ఏళ్ల క్రితం రాస్‌ థైరాయిడ్‌ క్యాన్సర్‌ బారిన పడ్డారు. చికిత్స చేసిన వైద్యులు కేవలం 3 నెలలు మాత్రమే బతికే అవకాశముందని చెప్పారు. అలాంటి వ్యక్తి క్యాన్సర్‌ను జయించి.. సీఈవో ఉద్యోగాన్ని విడిచిపెట్టి.. గత 12 ఏళ్లుగా ఇలాగే జీవనం సాగిస్తున్నారు.

చదవండి: ఇలా అయ్యిందేంటి.. ముఖానికి సర్జరీ.. అక్కడ వెంట్రుకలు మొలుస్తున్నాయ్‌!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)