నిప్పు చల్లగా.. మంచు మంటగా!

Published on Mon, 05/05/2025 - 07:24

మెల్‌బోర్న్‌(ఆస్ట్రేలియా): మంటను ముట్టుకుంటే కాలిపోతుంది. మంచును టచ్‌ చేస్తే చల్లగా ఉంటుంది. కానీ ఈ ఆ్రస్టేలియా వ్యక్తికి మాత్రం నిప్పు చల్లగా ఉంటుంది. చల్లని పదార్థం చురుక్కుమటుంది. అదెలా సాధ్యమంటే, అదో వింత వ్యాధి. అతని కాళ్లు, చేతులు గ్రహణ శక్తి కోల్పోయాయి. ఈ వ్యాధితో అతను ఐదేళ్లుగా బాధపడుతున్నాడు. ఎన్నో పరీక్షలు చేసినా వ్యాధేమిటో తెలిసింది కానీ చికిత్స ఏమిటో తెలియడం లేదు. 

ఆ్రస్టేలియాకు చెందిన 22 ఏళ్ల ఎయిడెన్‌ మెక్‌మానస్‌ 17వ ఏట హైస్కూల్ చివరి ఏడాదిలో ఉండగా ఈ సమస్య మొదలైంది. పాదాల్లో కొద్దికొద్దిగా అనుభూతిని కోల్పోవడం మొదలైంది. పాదాలు చక్కిలిగింతలు పెట్టినట్టుగా, తిమ్మిరెక్కినట్టుగా అనిపించడం మొదలైంది. పాదాల్లోకి రక్తం, ఇతర ద్రవాల సరఫరా లేదంటూ డాక్టర్‌ మందులిచ్చాడు. అవేవీ పని చేయలేదు. నడవడమే కష్టంగా మారడంతో న్యూరాలజిస్టులు 20కి పైగా రక్త పరీక్షలు చేశారు. బయాప్సీ కూడా చేసినా వ్యాధీ నిర్ధారణ కాలేదు. చివరకు అతను ఆక్సోనల్‌ పెరిఫెరల్‌ న్యూరోపతితో బాధపడుతున్నాడని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఇది శరీరానికి సంకేతాలను ప్రసారం చేయకుండా నాడీ కణాలను అడ్డుకుంటుంది. 

దాంతో తన కుమారుడు వేడిగా ఏదైనా తీసుకున్నప్పుడు, చల్లగా అనిపిస్తుందని, చల్లగా ఉన్నప్పుడు మండుతున్న అనుభూతిని పొందుతాడని తల్లి ఏంజిలా మెక్‌మానస్‌ వాపోయారు. అతని రోజురోజుకీ పరిస్థితి దిగజారిపోతోంది. నడక సామర్థ్యం, కాళ్లు, చేతుల్లో సమతుల్యత, సమన్వయం తగ్గుతున్నాయి. నయం చేయలేని ఈ వ్యాధికి చికిత్సను భరించలేమని నేషనల్‌ డిజేబులిటీ ఇన్సూరెన్స్‌ ఏజెన్సీ (ఎన్‌డీఐఏ) సైతం చేతులెత్తేసింది. చికిత్సేమిటో తెలియకుండా నిధులివ్వలేమని తేల్చేసింది. కానీ నొప్పి నివారణ మందులు తప్ప ప్రస్తుతానికి అతనికి చికిత్స అందుబాటులో లేదని న్యూరాలజిస్ట్‌ చెప్పుకొచ్చారు. పరిస్థితి నానాటికి దిగజారిపోయే పరిస్థితి ఉంది గనుక ఎన్‌డీఐఏలో చేర్చాలంటూ ఏజెన్సీకి లేఖ రాశారు.      

#

Tags : 1

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)