Breaking News

పాలస్తీనాకు ఆస్ట్రేలియా గుర్తింపు.. అయితే ఈ షరతులు వర్తింపు..

Published on Mon, 08/11/2025 - 13:37

కాన్‌బెర్రా: త్వరతో జరగబోయే యూఎన్‌  జనరల్ అసెంబ్లీలో ఇతర పాశ్చాత్య దేశాలతో పాటు ఆస్ట్రేలియా కూడా పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తిస్తుందని ప్రధాని  ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. దీంతో పాలస్తీనా దేశాన్ని గుర్తించే దేశాల జాబితాలో ఆస్ట్రేలియా ఫ్రాన్స్, యూకే, కెనడాలున్నాయి.

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ సోమవారం ఒక ప్రకటనలో సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాలస్తీనా దేశాన్ని అధికారికంగా ఆమోదించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇటీవల  ఇదే అభిప్రాయాన్ని ఫ్రాన్స్, బ్రిటన్, కెనడాలు వ్యక్తం చేశాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా ఆయా దేశాలకు మద్దతు పలికింది. అయితే ఆస్ట్రేలియా గుర్తింపు అనేది పాలస్తీనా అథారిటీ నుండి అందుకున్న నిర్దిష్ట హామీలపై ఆధారపడి ఉంటుందని అల్బనీస్ స్పష్టం చేశారు. వీటిలో హమాస్‌ను పాలస్తీనా ప్రభుత్వం నుండి  తొలగించడం, గాజాను సైనికీకరణ నుంచి విముక్తి చేయడం, స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలు నిర్వహించడం మొదలైనవి ఉ‍న్నాయి.

గాజాలో మానవతా సంక్షోభంపై ఆస్ట్రేలియాలో పెరుగుతున్న  ఆందోళనల మధ్య ఈ ప్రకటన వెలువడింది. ఆస్ట్రేలియా అధికారులు గాజాలో కొనసాగుతున్న  ఆకలి మంటలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల గాజాలో పెద్ద ఎత్తున సైనిక దాడికి ప్రణాళికలు వేయడాన్ని ఆస్ట్రేలియా ఖండించింది. మధ్యప్రాచ్యంలో హింసాయుత ఘటనలను విచ్ఛిన్నం చేయడానికి, గాజాలో సంఘర్షణలు, ఆకలిని అంతం చేయడానికి పాలస్తీనా దేశపు గుర్తింపు అనేది పరిష్కారం మార్గం అవుతుందని ప్రధాని అల్బనీస్ అన్నారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)