Breaking News

ఆస్ట్రేలియాలో మే 3న ఎన్నికలు

Published on Sat, 03/29/2025 - 04:41

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలో మే 3న సార్వత్రిక ఎన్నికలు జరగను న్నాయి. ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ (62) శుక్రవారం ఉదయం గవర్నర్‌ జనరల్‌ శామ్‌ మోస్టిన్‌ను కలిసి ఎన్నికలకు అనుమతి కోరారు. అనంతరం మీడియా ముందు ఆ మేరకు ప్రకటన చేశారు. ప్రజల జీవన వ్యయాన్ని తగ్గించేందుకు కృషిని కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యర్థి పీటర్‌ డట్టన్‌ (54)ను ఎన్నుకుంటే దేశం వెనక్కు పోతుందన్నారు. ‘‘ప్రపంచం కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాపై విమర్శలు గుప్పిస్తోంది. అనిశ్చిత సమయాల్లో మనం ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాలన్నది మన చేతుల్లో లేదు. 

కానీ వాటికి ఎలా స్పందించాలన్నది మన చేతుల్లోనే ఉంది. మా ప్రభుత్వం ఎన్నో అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొంది. ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. వారికి అందమైన భవిష్యత్తు అందించేందుకు కృషిని కొనసాగిస్తాం’’ అన్నారు. దశాబ్దం పాటు అధికారంలో ఉన్న కన్జర్వేటివ్‌ పార్టీని ఓడించి ఆల్బనీస్‌కు చెందిన సెంట్రల్‌ లెఫ్ట్‌ లేబర్‌ పార్టీ 2022 మేలో అధికారం చేపట్టింది. అప్పటికి ఎనిమిదేళ్లలో ఏకంగా ఆరుసార్లు ప్రధానులు మారారు! సుదీర్ఘ రాజకీయ అస్థిరత తర్వాత ఎక్కువ కాలం ప్రధానిగా చేసిన నేతగా ఆల్బనీస్‌ నిలిచారు. కానీ ఆయన పాలనపై కూడా కొంతకాలంగా జనం పెదవి విరుస్తున్నారు.

సమస్యలతో సావాసం
ఆస్ట్రేలియా పార్లమెంటులో 150 స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 76 సీట్లు అవసరం. వామపక్ష భావజాలమున్న లేబర్‌ పార్టీ, మితవాద లిబరల్‌ నేషనల్‌ పార్టీలదే ఆస్ట్రేలియా రాజకీయాల్లో చాలాకాలంగా ఆధిపత్యం. ప్రధాన అభ్యర్థులుగా ఆల్బనీస్, లిబరల్‌ పార్టీ సారథి డట్టన్‌ బరిలో ఉన్నారు. వారితో పాటు పలువురు స్వతంత్రులు కూడా పోటీ చేస్తున్నారు. వ్యయం, ఆర్థిక అవ్యవస్థ, చైనా ఆధిపత్యం ఎన్నికల్లో ప్రధానాంశాలు కానున్నాయి. చౌక గృహాల కొరత, అధిక వడ్డీ రేట్లతో ప్రజలు సతమతం అవుతున్నారు. ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోంది. అద్దె, విద్యుత్‌ బిల్లులపై పన్ను కోతలు, సబ్సిడీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. రికార్డు స్థాయి వలసలు, నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు