Breaking News

నిర్బంధ ఓటింగ్‌కు వందేళ్లు

Published on Sat, 05/03/2025 - 02:23

ఆ్రస్టేలియా పార్లమెంటుకు శనివారం ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలోని 1.8 కోట్ల మంది అర్హులైన ఓటర్లు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. ఆ దేశంలో ఓటేయడం కేవలం నచ్చిన అభ్యరి్థని ఎన్నుకునే ప్రక్రియ మాత్రమే కాదు.. తప్పనిసరిగా పాటించి తీరాల్సిన చట్టపరమైన బాధ్యత. ఎందుకంటే ఆ్రస్టేలియాలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలని చట్టముంది.

 దాంతో అనేక దేశాలు ప్రజలను పోలింగ్‌ కేంద్రాలకు తీసుకురావడానికి నానా కష్టాలు పడుతుంటే ఆస్ట్రేలియా మాత్రం ప్రపంచంలోనే అత్యధిక ఓటింగ్‌ నమోదయ్యే దేశాల్లో ఒకటిగా ఉంది. 2022 ఎన్నికల్లో ఏకంగా 90 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు! బ్రిటన్‌లో 2024 ఎన్నికల్లో కేవలం 60 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. అమెరికాలో ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో 64 శాతం నమోదైంది. 

చట్ట సవరణ 
ఆ్రస్టేలియాలో 1924లో ఎన్నికల చట్టాన్ని సవరించి ఫెడరల్‌ ఎన్నికల్లో ఓటేయడాన్ని తప్పనిసరి చేశారు. దానిప్రకారం ఫెడరల్‌ ఎన్నికల్లో ఓటు వేయకపోతే 20 డాలర్లు, రాష్ట్ర ఎన్నికల్లో ఓటేయకపోతే 79 డాలర్ల దాకా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ చట్టం బాగానే పనిచేసింది. 1922 ఎన్నికల్లో 60 శాతం కూడా లేని ఓటింగ్‌ చట్టం తర్వాత 1925 ఎన్నికల్లో ఏకంగా 91 శాతం దాటేసింది. నిర్బంధ ఓటింగ్‌ వల్ల గెలిచినవారు మరింత బాధ్యతాయుతంగా ఉంటారనే వాదన కూడా ఉంది.

నిర్బంధ ఓటు అట్టడుగు వర్గాలకు మెరుగైన ప్రాతినిధ్యం కల్పించడానికి కూడా సహాయపడుతుందని, ఇది మరింత సమసమాజ ప్రజా విధానాలను రూపొందిస్తుందని నిపుణుల విశ్లేషణ. నిర్బంధ ఓటింగ్‌ విధానంలో మధ్యతరగతి పౌరులు, వారి ఆందోళనలు, సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుంటారని, ఇది ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కనిపించే పోలరైజేషన్‌ రాజకీయాలను నిరోధించి భిన్నమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందనే అభిప్రాయం ఉంది. ప్రత్యేక పరిస్థితుల్లో ఓటు వేయలేకపోతే ఏంటి పరిస్థితి? సరైన కారణం ఉంటే మినహాయింపు ఉంటుంది.

ఆ్రస్టేలియన్లు ఏమంటున్నారు?
నిర్బంధ ఓటింగ్‌ గురించి ఆస్ట్రేలియాలో ఎలాంటి వివాదం లేదు. ఈ చట్టానికి ప్రజల గట్టి మద్దతుంది. దీనికి 70 శాతం ఆమోదం ఉందని 1967 నుంచి జరిగిన పలు జాతీయ సర్వేలు తేల్చాయి. అయితే నిర్బంధ ఓటింగ్‌ను రద్దు చేయాలని దశాబ్దాలుగా డిమాండ్, ఆందోళనలు చేస్తున్న వాళ్లూ ఉన్నారు. ఓటేయాలో వద్దో ఎంచుకునే హక్కు పౌరులకు ఉండాలన్నది వారి వాదన. వాళ్లకు ప్రజాదరణ అంతంతే. నిర్బంధ ఓటింగ్‌ ద్వారా యువకులు మనమందరం ఎలాగైనా ఓటు వేయాలి అనే అవగాహనకు వస్తున్నారు. రాజకీయ ప్రక్రియలో పాల్గొనడంతోపాటు ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారు. నిర్బంధ ఓటు లేకపోయినా స్వచ్ఛందంగా ఓటేసే వాళ్లమేనని 2022లో 77 శాతం మంది ఆ్రస్టేలియన్లు చెప్పడం విశేషం!

వేతనంతో కూడిన సెలవు
ఓటింగ్‌కు అడ్డంకులు తొలగించడానికి, ప్రజలంతా ఓటింగ్‌లో పాల్గొనేలా చూడటానికి అధికారులు పలు విధానాలను అమలు చేశారు. ఆస్ట్రేలియాలో శనివారాల్లోనే ఎన్నికలు జరుగుతాయి. వీకెండ్‌ కావడంతో ఎక్కువ మంది స్వేచ్ఛగా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్తారు. యాజమాన్యాలు ఎన్నికల రోజున కార్మి కులకు వేతనంతో కూడిన సెలవు ఇస్తాయి.

పోలింగ్‌ బూత్‌ల దగ్గర బార్బెక్యూలపై కాల్చిన డెమోక్రసీ సాసేజ్‌లు అదనపు ప్రోత్సాహం. ఎన్నికల రోజు పోలింగ్‌ కేంద్రాల దగ్గర నిధుల సేకరణ కోసం ఏర్పాటు చేసే ఈ స్నాక్స్‌ ఆ్రస్టేలియా ఎన్నికలకు చిహ్నాలుగా మారాయి. ఇవి స్థానిక పాఠశాలలు, కమ్యూనిటీలకు అతి పెద్ద నిధుల సేకరణ కార్యక్రమాలుగా మారా యి. మొత్తంగా ఎన్నికల రోజు ఆ్రస్టేలియాలో పండుగ వాతావరణం ఉంటుంది.     – సాక్షి, నేషనల్‌ డెస్క్‌   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)