బంగ్లాదేశ్ ఎన్నికలు.. మ్యానిఫెస్టోలో హిందువుల దాడులు..?

Published on Fri, 02/06/2026 - 21:58

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షేక్ హాసీనా భారత్‌లో తలదాచుకున్న మెుదలు అక్కడి మతఛాందస వాదులు హిందువులపై ఊచకోత జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ దేశంలో దాదాపు ఎనిమిది శాతం ఉన్న హిందువులకు అక్కడి పార్టీలు ఏ రకమైనా హామీలిచ్చాయి. దాడులపై ఎలా స్పందించాయి. అనే విషయం తెలుసుకోవాలి ఉందా అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయ్యండి.

ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో భారత్ సంబంధాలు ఎంతమాత్రం ఆశించిన విధంగా లేవు. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వయిజర్‌గా మహ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారత్తో డిస్టెన్స్ పెంచారు.  గతంలో ఎన్నడూ లేనంతగా భారత్, బంగ్లా సంబంధాలు క్షీణించాయి. అంతే కాకుండా ఆ దేశంలో హిందువులపై పెద్దఎత్తున దాడులు జరుగుతున్నాయి. అక్కడ అధికారంలోకి వచ్చే పార్టీ భారత్‌తో ఎలా వ్యవహరించనున్నదనే అంశం ఆసక్తిగా మారింది.

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ
రెహమాన్ నేతృత్వంలోని BNP శుక్రవారం తన మ్యానిఫెస్టోని ప్రకటించింది. బంగ్లాదేశ్ ఫస్ట్ నినాదమే తమ ఎజెండా అని  ఆ పార్టీ చీఫ్ తారిక్ రెహమాన్ తెలిపారు. బంగ్లాదేశ్ ఏ దేశానికి ప్రతినిధిగా ఉండదని సమానత్వం, ఆత్మగౌరవం ఆధారంగా మాత్రమే ఇతర దేశాలతో సంబంధాలు ఏర్పరచుకుంటుందని పేర్కొన్నారు. అదే విధంగా బంగ్లాదేశ్ ఏ ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోదు. అదే విధంగా తమ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకుంటే సహించదు అన్నారు. తమదేశం అటు పాకిస్థాన్‌తో గానీ ఇటు ఇండియాతో గానీ పొత్తు పెట్టుకోదని తెలిపారు. " అటు ఢిల్లీ కాదు ఇటు పిండి కాదు బంగ్లా అన్నింటికంటే ముందుంటుంది" అని తెలిపారు.

జమాత్- ఇ- ఇస్లామీ 

అయితే అదే దశలో మరో పార్టీ జమాత్- ఇ- ఇస్లామీ పార్టీసైతం తన మ్యానిఫెస్టో విడుదల చేసింది. దానిలో చుట్టుపక్కల దేశాలతో స్నేహా పూర్వక వాతావరణం పెంపొందిస్తామని పేర్కొంది. ప్రత్యేక్షంగా పాకిస్థాన్‌ పేరు తీయకపోయినా ముస్లిం మెజారిటీ దేశాలకే అనుకూలంగా ఉండనున్నట్లు ప్రకటించింది.

హిందువుల దాడులపై

బీఎన్‌పీ:  హిందువులతో పాటు ఇతర  మైనార్టీల ఆస్తుల, దేవాలయాలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొంది. అదే విధంగా వారి మనోభావాలను గౌరవిస్తామని తెలిపింది. అన్ని మతాలకు చెందిన నాయకులకు ప్రత్యేక స్టై ఫండ్ ఇస్తామని ప్రకటించింది. మతపరమైన పండుగలను ఎటువంటి ఆటంకం లేకుండా జరుపుకునేలా రక్షణ కల్పిస్తామని తెలిపింది.

జమాత్-ఇ-ఇస్లామీ: సాధారణంగా ఈ పార్టీకి చెందిన నాయకులే హిందువులపై అధికంగా దాడులు చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే హిందువుల రక్షణపై ఆ పార్టీ మ్యానిఫెస్టోలో పెద్దగా స్పందించలేదు. మతపరమైన మరియు జాతి మైనారిటీలకు ప్రాతినిథ్యం  కల్పిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఫిబ్రవరి 12న ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)