Breaking News

భూమికి మరో చంద్రుడు !

Published on Mon, 10/27/2025 - 02:56

న్యూఢిల్లీ: భూమికి చంద్రుడు మాత్రమే శాశ్వత సహజ ఉపగ్రహం. అయితే దీనికి తోడుగా కొన్నాళ్లపాటు భూమిని చుట్టేస్తూ తాత్కాలిక చందమామ ఒకటి కొత్తగా వచ్చి చేరింది. దీనికి 2025 పీఎన్‌7 అని నామకరణం చేశారు. వాస్తవానికి ఇది సహజ ఉపగ్రహం కాదు. చిన్నపాటి గ్రహశకలం మాత్రమే. తన కక్షలో వెళ్తూ సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తోంది. అయితే గత 60 ఏళ్లుగా ఇది భూమికి సమీపంగా ఉంటూ సూర్యుడి చుట్టూతా తిరుగుతోంది. అయితే భూమి నుంచి చూసినప్పుడు ఇది మన భూమి చుట్టూతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అందుకే దీనిని ఖ్వాసీ మూన్‌గా పిలుస్తున్నారు.

 ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హవాయిలోని పనోరమిక్‌ సర్వే టెలిస్కోప్,ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌ సాయంతో దీని జాడను కనిపెట్టారు. భూమి చుట్టూ పరిభ్రమిస్తు్తన్న ‘అర్జున’ గ్రహశకలాల కూటమిలో ఇది కొత్తగా వచ్చి చేరిందని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. కేవలం 20 మీటర్ల వెడల్పున్న దీనిని ఈ ఏడాది ఆగస్ట్‌లో కనిపెట్టారు. 

ఎనిమిది అంకె ఆకృతిలో లేదా గుర్రపు డెక్క ఆకృతిలో ఇది సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది. సూర్యుడు, భూమి గురుత్వాకర్షణ శక్తుల కారణంగా దీని పథం ఇలా విభిన్న ఆకృతిలో ఉంది. సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో ఇది ఒక దశలో భూమికి కేవలం 2,99,000 కిలోమీటర్ల దూరంలో సంచరిస్తుంది. మరో దశలో గరిష్టంగా 1.7 కోట్ల కిలోమీటర్ల దూరంలో కనిపిస్తుంది. సగటున ఇది 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గురుత్వాకర్షణ బలాలకు లోనై ఇది భూమిపై పడిపోయే అవకాశం లేదని తెలుస్తోంది. కొన్ని దశాబ్దాల తర్వాత భూమి నుంచి దూరంగా వెళ్లిపోనుంది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)