Breaking News

సునీతా విలియమ్స్‌ సరికొత్త రికార్డు

Published on Fri, 01/31/2025 - 16:23

నాసా వ్యోమగామి, భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అంతరిక్షంలో అత్యధిక సమయం నడిచిన మహిళా వ్యోమగామిగా నిలిచారు.  ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌లో ఉన్న ఆమె.. తన 9వ స్పేస్‌వాక్‌ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎక్కువ సేపు స్పేస్‌ వాక్‌ చేసిన ఘనతతో ఆమె నాసా ఆల్‌టైం లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు.

సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌ గురువారం ఉమ్మడిగా స్పేస్‌వాక్‌ చేశారు. తాజా స్పేస్‌వాక్‌తో కలిపి.. మొత్తంగా 62 గంటల 6 నిమిషాలపాటు ఆమె వాక్‌ పూర్తి చేసుకున్నారు. తద్వారా నాసా వ్యోమగామి పెగ్గీ వైట్‌సన్‌ రికార్డు(60 గంటలు) ఆమె అధిగమించారు. అంతేకాదు.. స్పేస్‌వాక్‌ టాప్‌ టెన్‌ జాబితాలో సునీతా విలియమ్స్‌ నాలుగో స్థానానికి ఎగబాకారు. 

అత్యధికంగా స్పేస్‌వాక్‌ చేసింది కాస్మోనాట్‌ అనాటోలీ సోలోవ్‌యెవ్‌. పదహారుసార్లు స్పేస్‌వాక్‌ చేసిన ఆయన.. 82 గంటల 22 నిమిషాలు గడిపారు. ఇక ఈ టాప్‌ టెన్‌ లిస్ట్‌లో ఎనిమిది మంది నాసా వ్యోమగాములే ఉండడం గమనార్హం. ఫైడోర్‌ యర్చికిహిన్‌(కాస్మోనాట్‌) 59 గంటల 28 నిమిషాలు వాక్‌ చేసి తొమ్మిది స్థానంలో కొనసాగుతున్నారు.

కాస్మోనాట్‌.. రష్యా(పూర్వపు సోవియట్‌ యూనియన్‌) వ్యోమగామి , 

ఆస్ట్రోనాట్.. అమెరికా నాసా వ్యోమగామి.. 

వ్యోమనాట్‌.. తరచూ భారత వ్యోమగామికి, 

టైకోనాట్‌.. చైనా వ్యోమగామి, 

స్పేషియోనాట్‌.. ఫ్రాన్స్‌తో పాటు ఫ్రెంచ్‌ మాట్లాడే మరికొన్ని దేశాలు

వారం వ్యవధిలో సునీతా విలియమ్స్‌ స్పేస్‌వాక్‌ చేయడం ఇది రెండోసారి. సునీత, విల్‌మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు బయటి భాగంలో చేయాల్సిన మరమ్మతులు ఏమైనా ఉన్నాయా? అనేది పరిశీలించారు. భూమికి 420 కిలోమీటర్ల ఎగువన సరిగ్గా స్పెయిన్‌ దేశం పైభాగాన తాము స్పేస్‌వాక్‌ చేశామని, చాలా ఆనందంగా ఉందని వాళ్లు అంటున్నారు. 

ఇదిలా ఉంటే.. అంతరిక్షంలో తొలిసారి స్పేస్‌వాక్‌ చేసింది సోవియట్‌ కాస్మోనాట్‌(ప్రస్తుత రష్యా) వ్యోమగామి అలెక్సీ లెనోవ్‌. 1965, మార్చి 18వ తేదీన వాష్కోడ్‌ 2 మిషన్‌లో భాగంగా.. 12 నిమిషాల 9 సెకండ్లపాటు ఆయన బయటకు వచ్చారు. అంతరిక్ష పరిశోధనల్లో ఆయన నడక కొత్త అధ్యయనానికి నాంది పలికింది. 

ఇక.. గత ఏడాది జూన్‌లో వీళ్లిద్దరూ ఐఎస్‌ఎస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో అది సాధ్య పడలేదు. ఎప్పుడు తిరిగి వస్తారన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.అయితే.. అందుకోసం ప్రయత్నాలు మాత్రం ముమ్మరం అయ్యాయి.  ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం జోక్యం చేసుకున్నారు. ఇద్దరు వ్యోమగాములను వెనక్కి తీసుకురావడానికి సాయం అందించాలని స్పేస్‌ఎక్స్‌ అధినేత ఇలాన్‌ మస్క్ ను కోరారు. అన్నీకుదిరితే.. ఈ మార్చి ఆఖర్లో లేదంటే ఏప్రిల్‌ మొదటి వారంలో వాళ్లను భూమ్మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరగొచ్చు.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)