ప్రపంచంలో తొలి జన్యుమార్పిడి అశ్వం 

Published on Fri, 02/07/2025 - 05:53

బ్యూనస్‌ ఎయిర్స్‌: ప్రపంచంలోనే తొలిసారిగా జన్యుమార్పిడి చేసిన గుర్రాన్ని అర్జెంటీనాలో సృష్టించారు. అర్జెంటీనాలో ఎన్నో అవార్డ్‌లు గెల్చుకున్న ఆడ పోలో ప్యూరేఝా అనే గుర్రం నుంచి తీసుకున్న జన్యువులకు కొద్దిపాటి మార్పులు చేసి ఈ కొత్త అశ్వాలను సృష్టించారు. శాస్త్రవేత్తలు క్రిస్పర్‌–క్యాస్‌9 విధానాన్ని అవలంభించి పుట్టబోయే గుర్రం మరింత వేగంగా పరిగెత్తేందుకు ఉపకరించేలా ఫ్యూరేఝా జన్యువుల్లో మార్పులు చేశారు. గత ఏడాది అక్టోబర్, నవంబర్‌లో ఇలా ఐదు అశ్వాలు జన్మించినా తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

గుర్రాలపై పరుగెత్తుతూ ఆడే పోలో ఆటలో వినియోగించే అశ్వాల జాతికి చెందిన ఈ పోలో ప్యూరేఝా ఇప్పటికే ‘‘అర్జెంటీనా అసోసియేషన్‌ ఆఫ్‌ పోలో హార్స్‌ బ్రీడర్స్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’’లో చోటు దక్కించుకుంది. ఇది 1998 అర్జెంటీనా ఓపెన్‌లో ఉత్తమ గుర్రంగా అవార్డ్‌ గెలుపొందింది. మరింత మేలైన జాతి గుర్రాల సృష్టే లక్ష్యంగా అర్జెంటీనాకు చెందిన దిగ్గజ ‘‘కెయిరాన్‌ ఎస్‌ఏ’’బయోటెక్నాలజీ సంస్థ ఈ కొత్త గుర్రాలను సృష్టించింది. కెయిరాన్‌ సంస్థ గతంలోనూ క్లోనింగ్‌ చేసిన ఘనత సాధించింది. మూలకణాలనూ వినియోగించింది. ప్రపంచంలోనే తొలిసారిగా జన్యుమార్పిడి పిండాలనూ సృష్టించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)