Breaking News

ట్రంప్‌కు అరబ్‌ దేశాల షాక్‌..!

Published on Sat, 02/01/2025 - 19:45

కైరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అరబ్‌ దేశాలు షాకిచ్చాయి. అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత తాజాగా ట్రంప్‌ చేసిన ప్రతిపాదనను అరబ్‌ దేశాలు తిరస్కరించాయి. ఇజ్రాయెల్‌ వైమానిక దాడులతో పాలస్తీనాలోని గాజా  పూర్తిగా ధ్వంసమైన విషయం తెలిసిందే. ఇప్పటికిప్పుడు ప్రజలు నివసించేందుకు అక్కడి పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. 

ఈ నేపథ్యంలో అక్కడున్న పాలస్తీనీయులకు పొరుగునే ఉన్న ఈజిప్టు, జోర్డాన్‌లలో పునరావాసం కల్పించాలని ట్రంప్‌ ఇటీవల ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనను అరబ్‌ దేశాలు‌ తిరస్కరించాయి. ఈమేరకు ఈజిప్టు, జోర్డాన్‌, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్‌, పాలస్తీనా అథారిటీ, అరబ్‌ లీగ్‌లు సంయుక్తంగా ప్రకటన చేశాయి.

కాగా, గాజాపై ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 45 వేలమందికిపైగా చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రాణ నష్టంతో పాటు గాజాలో ఆస్తి నష్టం భారీగా సంభవించింది. ప్రజల జీవనానికి కావల్సిన మౌలిక సదుపాయాలేవీ ఇప్పుడక్కడ లేవు. గాజా పునఃనిర్మాణానికి భారీగా నిధుల అవసరం ఉంది. తాజాగా ఇజ్రాయెల్‌,హమాస్‌ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో గాజా నుంచి చెల్లాచెదురైన అక్కడి వారు తిరిగి గాజాకు చేరుకుంటున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)