Breaking News

సిరియాతో టచ్‌లోనే అమెరికా.. బ్లింకెన్‌ కీలక వ్యాఖ్యలు

Published on Sun, 12/15/2024 - 07:35

జోర్డాన్‌: సిరియాలో తిరుగుబాటుదారుల మొహమ్మద్‌ అల్‌ బషీర్‌ ప్రభుత్వంతో అమెరికా ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నట్టు విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పుకొచ్చారు. సిరియా ప్రజల కోసం ఇతర పార్టీలతో కూడా అమెరికా చర్చలు జరుపుతున్నట్టు ఆయన వెల్లడించారు.

ఆంటోని బ్లింకెన్‌ జోర్డాన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సిరియాతో కొత్త ప్రభుత్వంతో బైడెన్‌ టచ్‌లో ఉన్నారు. బషీర్‌ ‍ప్రభుత్వం సహా ఇతర పార్టీలతో మేము చర్చలు జరుపుతున్నాం. సిరియా ప్రజలకు సాయం చేసేందుకు అమెరికా సిద్దంగా ఉంది. పాలనలో బషీర్‌ ప్రభుత్వం విజయవంతం కావాలని కోరుకుంటున్నాం అని చెప్పారు. ఇదే సమయంలో తాము సిరియా అంతర్గత విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు.

మరోవైపు.. జోర్డాన్‌ విదేశాంగ మంత్రి అమాన్‌ సఫాది మాట్లాడుతూ.. సిరియాలో గందరగోళ పరిస్థితులు సృష్టించడం మాకు ఇష్టం లేదు. బషీర్‌ పాలనలో సిరియా ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

ఇదిలా ఉండగా.. సిరియాలో తిరుగుబాటుదారుల కారణంగా అధ్యక్షుడు అసద్‌.. దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అసద్‌ కుటుంబంతో సహా రష్యాలో తలదాచుకున్నారు. అసద్‌కు రష్యా ఆశ్రయం కల్పించింది. అసద్‌ సిరియాను వదిలివెళ్లిన తర్వాత అక్కడ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం, తిరుగుబాటుదారుల మద్దతుతో అల్‌ బషీర్‌ తాత్కాలిక ​ప్రధానిగా ఎన్నికయ్యారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)