Breaking News

Anti Valentine week : నేటి నుంచి భగ్న ప్రేమికులు చేసే పనిదే..

Published on Sat, 02/15/2025 - 07:55

‘అందమైన ప్రేమరాణి చేయి తగిలితే సత్తురేకు కూడ స్వర్ణమేలే’ అని పాడుకుంటూ ప్రేమికులు నిన్నటివరకూ వాలంటైన్స్ వీక్‌ను ఎంతో అద్భుతంగా చేసుకున్నారు. అయితే దీనికి భిన్నంగా భగ్నప్రేమికులు వాలంటైన్స్ వీక్‌లో ఆక్రోశానికి,ఆవేదనకు గురయ్యుంటారు. అందుకే వారంతా నేటి నుంచి (ఫిబ్రవరి15)నుంచి వారం రోజుల పాటు యాంటీ-వాలెంటైన్ వీక్‌ను ఉత్సహంగా చేసుకునేందుకు సిద్ధమయ్యారు. మరి.. ఈ వారం రోజుల్లో వారు ప్రేమను ద్వేషిస్తూ ఏమేంపనులు చేస్తారంటే..

యాంటీ-వాలెంటైన్ వీక్  ఫిబ్రవరి 15 నుండి మొదలవుతుంది. ఫిబ్రవరి 21 వరకు భగ్నప్రేమికులు ఒక్కోరోజును ఒక్కోథీమ్‌తో జరుపుకుంటారు.  ఇలా చేయడం వెనుక ఒక ప్రత్యేక ఉద్దేశ్యం ఉంది. వాలెంటైన్స్ వీక్‌లో ప్రేమను పొందలేని వారు, మనసు విరిగిపోయిన వారు ఈ యాంటీ-వాలెంటైన్స్ వీక్‌ను జరుపుకుని తమలోని దుఃఖాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తారు. స్లాప్ డే, కిక్ డే, పెర్ఫ్యూమ్ డే, ఫ్లర్ట్ డే, కన్ఫెషన్ డే, మిస్సింగ్ డే, బ్రేకప్ డే మొదలైన థీమ్‌లతో ఒక్కోరోజును ఒక్కోలా సెలబ్రేట్‌ చేసుకుంటారు.

స్లాప్ డే 
యాంటీ-వాలెంటైన్ వీక్‌లో ఫిబ్రవరి 15న స్లాప్ డే జరుపుకుంటారు. మాజీ ప్రియుడు లేదా ప్రియురాలిని మరచిపోయేందుకు స్లాప్ డే జరుపుకుంటారు. ప్రేమలో మోసపోయినవారు తమ ఒత్తిడిని, దుఃఖాన్ని మరచిపోయేందుకు  స్లాప్ డే చేసుకుంటారు. చేదు జ్ఞాపకాలు, చేదు అనుభవాల నుంచి బయటపడేందుకు స్టాప్‌డే సహకరిస్తుందని భగ్నప్రేమికులు చెబుతుంటారు.

కిక్ డే 
యాంటీ-వాలెంటైన్ వీక్‌లో రెండవ రోజు కిక్ డే. దీనిని ఫిబ్రవరి 16న కిక్ డే జరుపుకుంటారు. మాజీ జీవిత భాగస్వామితో వచ్చిన చేదు జ్ఞాపకాలను జీవితం నుండి తరిమికొట్టే మార్గంగా కిక్‌డేను జరుపుకుంటారు.

పెర్ఫ్యూమ్ డే  
పెర్ఫ్యూమ్ డే ఫిబ్రవరి 17న వస్తుంది. ఈ రోజున భాగస్వామి మిగిల్చిన పాత జ్ఞాపకాలను మరిపోయి, కొత్తగా మలుచుకునేందుకు ఇష్టమైన పెర్ఫ్యూమ్‌ను అప్లై చేసుకుంటారు.

ఫ్లర్ట్ డే
యాంటీ-వాలెంటైన్ వీక్‌లోని నాల్గవ రోజున ఫ్లర్ట్ డే జరుపుకుంటారు. ఈ రోజున తెగిపోయిన బంధాలను పక్కనపెట్టి, కొత్త స్నేహాలను ప్రారంభిస్తారు. ఫ్లర్ట్ డేను ఎవరికీ హాని చేయని విధంగా జరుపుకోవాలని పలువురు సూచిస్తుంటారు.

కన్ఫెషన్‌ డే 
దీనిని ఫిబ్రవరి 19న జరుపుకుంటారు. ఈ రోజున భగ్నప్రేమికులు గతాన్ని మరచిపోయి స్నేహితుడు, లేదా స్నేహితురాలికి క్షమాపణలు చెబుతారు. భవిష్యత్తులో అలాంటి తప్పు పునరావృతం చేయనని  హామీనిస్తారు.

మిస్టింగ్‌ డే 
ఇది ఫిబ్రవరి 20న వస్తుంది. ఎవరినైనా మిస్ అవుతుంటే ఆ విషయాన్ని ఆరోజున వారికి హృదయపూర్వకంగా తెలియజేస్తారు. మిస్‌ అవుతున్న ప్రియుడు లేదా ప్రియురాలికి ఫోన్‌ చేసి, మనసులోని భారాన్నంతా దించుకునే ప్రయత్నం చేస్తారు.

బ్రేకప్ డే
ఫిబ్రవరి 21న బ్రేకప్ డే జరుపుకుంటారు. ఎవరితోనైనా సంబంధం ఇక కొనసాగించలేనని అనిపిస్తే వారికి ఆరోజున బ్రేకప్‌ చెబుతారు. సంతోషంగా లేని సంబంధం కొనసాగించకూడదనే ఉద్దేశంతో బ్రేకప్ డేను జరుపుకుంటారు. బ్రేకప్‌ డే తరువాత విడిపోయిన ప్రేమికులు సానుకూలంటా ఉంటూ, ముందుకు సాగాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Mahakumbh: మహారికార్డు.. ఐదు కోట్లు దాటిన పవిత్ర స్నానాలు

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)