Breaking News

‘ఐస్‌’ మంటలు

Published on Wed, 06/11/2025 - 02:10

లాస్‌ ఏంజెలెస్‌/వాషింగ్టన్‌: అక్రమ వలస దారులను అదుపులోకి తీసుకోవాలన్న ట్రంప్‌ సర్కార్‌ పంతం చివరకు అడ్డూఅదుపూలేని నిరసన జ్వాలలను రేపింది. గత మూడు రోజులుగా లాస్‌ ఏంజెలెస్‌కే పరిమితమైన ఇమి గ్రేషన్, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(ఐస్‌) ఏరివేత కార్య క్రమం, దానికి వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు ఇప్పుడు ఇతర నగరాలకూ పాకాయి. శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, సియాటెల్, డాలస్, లూయీ విల్లే, శాన్‌ ఆంటోనియో, షికాగో నగరాల్లోనూ సోమ వారం ఆందోళనలు మొదలయ్యాయి. ఆందోళన కారుల నుద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన హెచ్చరిక వ్యాఖ్యలు నిరసనకారులు మరింత రెచ్చిపోయేలా చేశాయి.

మీరు నిరసనజ్వాలల్ని ఎగదోస్తే మేం బుల్లెట్లవర్షం కురిపిస్తాం. కట్టలు తెంచుకున్న ఆగ్రహాన్ని కట్టడిచేస్తాం. కాలిఫోర్నియా గవర్నర్‌ ఆందోళనకారులను రెచ్చగొట్టి నేషనల్‌ గార్డ్‌ల మీదకు ఉసిగొల్పుతున్నారు. గార్డ్‌లను రెచ్చగొడితే దారుణ పరిణామాలను ఎదుర్కొంటారు ’’ అని ట్రంప్‌ తన సొంత సామాజిక మాధ్య మం ‘ట్రూత్‌ సోషల్‌’ ద్వారా ఆందోళనకారులను హెచ్చరించారు. దానికితోడు లాస్‌ఏంజెలెస్‌ నగరానికి అదనంగా మరో 2,000 మంది నేషనల్‌ గార్డ్‌ రిజర్వ్‌బలగాలను పంపించారు. వీరికి తోడుగా 700 మంది నేవీ మెరైన్‌ సాయుధ సభ్యులూ రంగప్రవేశం చేశారు.

వేలాది మంది ఆందోళనకారులు ఒకవైపు వందల మంది పోలీసులు, నేషనల్‌ గార్డ్, మెరైన్లు ఒకవైపు ఎదురు నిలబడి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో లాస్‌ఏంజెలెస్‌ వీధులు కనీవినీ ఎరుగని స్థాయిలో యుద్ధక్షేత్రాలను తలపించాయి. డౌన్‌టౌన్‌ లాస్‌ఏంజెలెస్‌లో చాలా మంది మెక్సికో, గ్వాటెమాలా జాతీయజెండాలతో కనిపించారు. ఆందోళనలను రికార్డ్‌చేస్తున్న సీఎన్‌ఎన్‌ వార్తాసంస్థ విలేకరి, ఫొటో, వీడియో జర్నలిస్ట్‌లను పోలీసులు నిలువరించారు. ఆందోళనకారులు శాంతించాలని కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ విజ్ఞప్తిచేశారు. అదనపు బలగాలను రప్పిస్తూ మరోసారి అసా దారణ అధికారాలను ట్రంప్‌ దుర్వినియోగం చేశారని న్యూసమ్‌ ధ్వజమెత్తారు. 

బలగాలపై గవర్నర్, మేయర్‌ అభ్యంతరం
సోమవారం రాత్రి లాస్‌ ఏంజెలెస్‌లోని సివిక్‌ సెంటర్‌లోని సిటీ హాల్‌ వద్దకు వేలాదిగా ఆందోళనకా రులు గుమిగూడి భారీ ర్యాలీ చేపట్టారు. మరోవైపు పెద్దసంఖ్యలో అక్రమవలసదారులను బంధించి ఉంచిన డిటెన్షన్‌ సెంటర్‌ ఉన్న ఫెడరల్‌కాంప్లెక్స్‌ భవనం వద్దకు సైతం వందల మంది చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. లాస్‌ఏంజెలెస్‌ భయంకరమైన ఉద్యమ సంక్షోభంలోకి వెళ్తోందని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను న్యూసమ్, నగర మహిళా మేయర్‌ కరెన్‌ బాస్‌ తప్పుబట్టారు. 

టెక్సాస్, ఆస్టిన్, శాంటా అనా నగరాల్లోనూ..
కెంటకీ రాష్ట్రంసహా కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌ ప్రాన్సిస్కో శాంటా అనా, టెక్సాస్‌ రాష్ట్రంలోని డాలస్, ఆస్టిన్‌ నగరాల్లోనూ ‘ఐస్‌’ వ్యతిరేక ఆందోళనలు మొదలయ్యాయి. ఈ నగరాల్లో పలు ప్రాంతాల్లో స్థానికులు రోడ్ల మీదకొచ్చి ఇమిగ్రేషన్‌ అధికారుల ఆకస్మిక దాడులు, అరెస్ట్‌లను తప్పుబట్టారు. బోస్టన్, పీట్స్‌బర్గ్, ఛార్లొటే, సియాటెల్, వాషింగ్టన్‌ డీసీ, కనెక్టికట్, న్యూయార్క్‌ నగరాల్లోనూ నిరసన ప్రదర్శనలు భారీ ఎత్తున జరిగాయి. ఆస్టిన్‌ సిటీలోనూ నేషనల్‌ గార్డ్‌ రంగంలోకి దిగారు. ఆస్టిన్‌ నగరంలో డజనుకుపైగా ఆందోళనకారులను అరెస్ట్‌చేసినట్లు టెక్సాస్‌ గవర్నర్‌ గ్రెగ్‌ అబ్బాట్‌ తెలిపారు.

మరోవైపు నేషనల్‌ గార్డ్‌లను రాష్ట్రంలోకి అనుమతించే అంశంలో గవర్నర్‌ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడంపై కోర్టులో కేసు వేశామని కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌ రాబర్ట్‌ ఆండ్రీస్‌ బోంటా మంగళవారం ప్రకటించారు. ‘‘ మా రాష్ట్రంలో ఎలాంటి అంతర్యుద్ధం లేదు. తిరుగుబాటు అస్సలు లేదు. అలాంటప్పుడు రాష్ట్ర సార్వభౌమత్వాన్ని తొక్కిపెట్టేలా అధ్యక్షుడెలా నిర్ణయాలు తీసుకుంటారు?. ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోబోం.

అందుకే ట్రంప్, రక్షణ మంత్రి హెగ్సెత్‌పై కేసు వేశాం. ట్రంప్‌ ఉత్తర్వును చట్టవ్యతి రేకమైనదిగా ప్రకటించాలని కోర్టును కోరాం. అద నపు నేషనల్‌గార్డ్‌ల ప్రవేశాన్ని అడ్డుకునేలా ఆదేశా లు ఇవ్వాలని అభ్యర్థించాం’’ అని ఆయన వెల్లడించారు. నేషనల్‌ గార్డ్‌లను రాష్ట్రాల్లోకి అనుమతించడాన్ని విపక్ష డెమొక్రాట్లు తప్పు బట్టారు. ట్రంప్‌ దేశానికి రాజులా భావిస్తున్నారని కాలిఫోర్నియా డెమొక్రటిక్‌ పార్టీ నేత, దిగువసభ సభ్యుడు జాన్‌ గ్యారమెండీ ఆరోపించారు. మరోవైపు గార్డ్‌ల రాకను హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం  స్వాగతించింది.

శ్వేతసౌధం వివరణ
వలసదారుల ఏరివేత విధుల్లో ఉన్న ఇమ్మి గ్రేషన్‌ అధికారులు, ఫెడరల్‌ ఏజెంట్ల రక్షణ, కేంద్రప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసమే నేవీ మెరైన్‌ బలగాలను రప్పించామని శ్వేతసౌధం వివరణ ఇచ్చింది. నిరసనలను నిలువరించాలంటే నేవీ మెరైన్లు రావాల్సిందేనని బోర్డర్‌ జార్‌ టామ్‌ హోమన్‌ అభిప్రాయపడ్డారు.

కార్మిక నేత విడుదల
శుక్రవారం అరెస్టయిన కార్మిక నేత డేవిడ్‌ హుయెర్టాను 50వేల డాలర్ల పూచీకత్తుతో ఇమిగ్రేషన్‌ అధికారులు సోమవారం విడుదలచేశారు. సర్వీస్‌ ఎంప్లాయీస్‌ ఇంటర్నేషనల్‌ యూనియన్‌ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్‌ అరెస్ట్‌ తర్వాతే ఆందోళనలు మరింత ఉధృతమవడం తెల్సిందే.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)