Breaking News

మరో హిందువుపై దాడి

Published on Thu, 01/01/2026 - 17:19

ఢాకా:  బంగ్లాదేశ్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులే లక్ష్యంగా జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మొహమ్మద్‌ యూనుస్‌ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వ ఏలుబడిలో హిందువులకు రక్షణ కరువైందన్న వాదనలకు మరింత బలం చేకూరేలా మరో ఘటన చోటు చేసుకుంది. 

తాజాగా మరో  హిందూ వ్యక్తిపై దాడి జరిగింది. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న ఒక వర్గానికి చెందిన కొందర వ్యక్తులు కలిసి.. ఖోకాన్‌ దాస్‌ అనే వ్యక్తిని తీవ్రంగా గాయపరిచారు. ఖోకాన్‌ దాస్‌కు నిప్పంటించి హత్య చేసే యత్నం చేశారు. 50 ఏళ్లకు పైగా ఉన్న ఖోకాన్‌ దాస్‌.. ఇంటికి వెళుతున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. షరియత్‌ పూర్‌ జిల్లాలో డిసెంబర్‌ 31వ తేదీన జరిగిన ఈ ఘటన మరొకసారి బంగ్లాదేశ్‌లో ఉంటున్న మైనార్టీ హిందువుల భవితవ్యంపై సవాల్‌ విసురుతోంది.  

బంగ్లాదేశ్‌లో ఇటీవల హింసాత్మక  ఆందోళనలు మొదలైన తర్వాత హిందువులపై దాడి జరగడం ఇది నాల్గోసారి. డిసెంబర్‌ 24వ తేదీన కాలీమోహన్‌ ఏరియాలో అమృత్‌ మోండ్‌(29) అనే హిందూ యువకుడిపై దాడి జరగ్గా, డిసెంబర్‌ 18వ తేదీన దీపూ చంద్రదాస్‌ అనే 25 ఏళ్ల హిందూ యవకుడిని దారుణంగా హత్యచేశాయి అల్లరిమూకలు.  డిసెంబర్‌ 29వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు మెమిన్‌సింగ్‌ జిల్లాలోని మెహ్రాబారీ ప్రాంతంలోని సుల్తానా స్వెట్టర్స్‌ లిమిటెడ్‌ వస్త్ర పరిశ్రమ వద్ద సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసే 42 ఏళ్ల బజేంద్ర బిశ్వాస్‌ హత్యకు గురయ్యారు. తోటి సెక్యూరిటీ గార్డ్‌ అయిన 29 ఏళ్ల నోమన్‌ మియా తన సర్విస్‌ షాట్‌గన్‌తో కాలచ్చింపాడు. 

Videos

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)