Breaking News

Dangeti Jahnavi : అంతరిక్షంలోకి ఆంధ్రా అమ్మాయి.. ఎప్పుడంటే?

Published on Mon, 06/23/2025 - 21:27

సాక్షి,అమరావతి: ఆంధ్ర అమ్మాయి దంగేటి జాహ్నవి అరుదైన ఘనతను సాధించారు. 2029లో అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగామిగా ఎంపికయ్యారు.  

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి 2029లో అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్నారు. జాహ్నవి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి నాసా నిర్వహించే అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందారు.

జాహ్నవి అమెరికాలోని టైటాన్స్ ఆర్బిటల్ పోర్ట్ స్పేస్ స్టేషన్‌కు ఎంపికై నాలుగేళ్లలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలోకి అడుగు పెట్టనున్నారు. పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీఎటెక్ పూర్తిచేసిన జాహ్నవి ఇంటర్మీడియట్ వరకు తన స్వగ్రామమైన పాల కొల్లులోనే చదువుకున్నారు. ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్, పద్మశ్రీ.. ఉద్యోగ రిత్యా వాళ్లిద్దరూ కువైట్‌లో ఉంటున్నారు. 

అంతరిక్ష పట్ల అపారమైన ఆసక్తి ఉన్న జాహ్నవి, విద్యార్థులకు సైన్సు, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాథమేటిక్స్ (STEM) విద్యపై చైతన్యాన్ని కలిగించే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మన దేశంలో ప్రముఖ ఎన్ఐటీల్లో ప్రసంగాలు ఇచ్చారు. అంతేకాకుండా, అనాలోగ్ మిషన్లు, డీప్ సీ డైవింగ్, దీర్ఘకాలిక అంతరిక్ష ప్రయాణాల స్థిరతపై ప్రపంచ సదస్సుల్లోనూ పాల్గొంటూ వచ్చారు.

International Astronomical Search Collaboration లో ఆమె కృషి ద్వారా, పాన్-స్టార్స్ టెలిస్కోప్ డేటా ఆధారంగా ఓ ఆస్ట్రాయిడ్‌ను తాత్కాలికంగా గుర్తించారు. తద్వారా స్పేస్ ఐస్‌లాండ్‌లో జరిపే జియాలజీ శిక్షణ కోసం ఎంపికైన తొలి భారతీయురాలిగా పేరు సంపాదించారు. నాసా స్పేస్ అప్స్ చాలెంజ్‌లో పీపుల్స్ చాయిస్ అవార్డు, ఇస్రో అందజేసే వరల్డ్ స్పేస్ వీక్ యంగ్ అచీవర్ అవార్డుతో పాటు ఇతర ప్రతిష్టాతకమైన అవార్డులను ఆమె సొంతం చేసుకున్నారు.  

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)