Breaking News

22 ఏళ్ల క్రితం అదృశ్యం.. చెక్కుచెద‌ర‌ని స్థితిలో మృత‌దేహం!

Published on Tue, 07/09/2024 - 15:55

22 ఏళ్ల క్రితం అదృశ్య‌మైన ఓ ప‌ర్వ‌తారోహ‌కుడి మృత‌దేహాం పెరూ దేశంలో తాజాగా బ‌య‌ట‌ప‌డింది. మృతుడిని అమెరికాకు చెందిన విలియం స్టాంప్‌ఫ్ల్‌గా గుర్తించారు. జూన్ 2002లో ఆయ‌న ఆదృశ్య‌మ‌వ్వ‌గా అప్పుడు అత‌ని వ‌య‌సు 59 ఏళ్లు. పెరూలోని హుస్క‌ర‌న్ అనే ప‌ర్వతాన్ని అధిరోహిస్తూ మిస్ అయ్యారు. ఆ ప‌ర్వ‌తం ఎత్తు 6,700 మీట‌ర్లు(22,000 అడుగులు). 

ఆ స‌మ‌యంలో విలియం కోసం రెస్క్యూ బృందాలు ఎంత గాలించిన ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. దీంతో పర్వతారోహకుడి కుటుంబం అతడిపై ఆశలు వదులుకుంది. వాతావర‌ణ మార్పుల వ‌ల్ల ఆండీస్‌లోని కార్డిల్లెరా బ్లాంకా శ్రేణిలో మంచు క‌రిగిపోవ‌డంతో  22ఏళ్ల క్రితం అదృశ్యమైన విలియం మృత‌దేహం బ‌య‌ట‌ప‌డిన‌ట్లు పెరూవియన్ పోలీసులు పేర్కొన్నారు.

అయితే ఇన్నేళ్ల అత‌ని మృత‌దేహం దొరికిన‌ప్ప‌టికీ.. అది చెక్కుచెద‌రని స్థితిలో ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. పర్వతారోహకుడి శరీరంపై మంచు దట్టంగా పేరుకుపోవడంతో అతడి శరీరం మునుపటిలానే ఉంద‌ని, ఒంటిపై ఉన్న బ‌ట్ట‌లు,  బూట్లు మంచులో అలాగే  భ‌ద్రంగా ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

అత‌ని జేబులో ల‌భించిన పాస్‌పోర్టు ఆధారంగా మృతుడిని గుర్తించామ‌ని, వారి కుటుంబసభ్యులను సంప్రదించి మృతదేహాన్ని వారికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. కాగా  ఈశాన్య పెరూలోని హుస్కరన్, కాషాన్ వంటి పర్వతాలను దేశ‌, విదేశీ పర్వతారోహకుల‌ను ఆక‌ర్షిస్తుంటాయి. కాగా గ‌త మేలో ఇజ్రాయెల్‌, ఇటలీకి చెందిన ఇద్దరు పర్వతారోహకులు హుస్కరన్ పర్వతాన్ని అధిరోహిస్తూ మృతి చెందారు.

 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు