Breaking News

పర్ఫెక్ట్‌ టైమింగ్‌: కెమెరాకు చిక్కిన మూడు తలల చీతా!

Published on Thu, 06/29/2023 - 09:06

అత్యంత వేగవంతమైన పరుగుకు చీతా కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంది. అది పరిగెడున్నప్పుడు చూస్తే అది గాలితో పోటీ పడుతున్నదేమో అని అనిపిస్తుంది. ఇంతటి వేగం కలిగిన చీతాకు అడ్డుపడే ఏ జీవి అయినా ప్రాణాలతో మిగలదని చెబుతుంటారు. ప్రపంచంలో చీతాల జాతి మెల్లమెల్లగా అంతరించిపోతున్నదని పలు నివేదికలు చెబుతున్నాయి. 

అయితే ఆఫ్రికాలోని కొన్ని అడవుల్లో చీతాలు విరివిగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు మీరు పైనున్న ఫొటోలో చీతాకు సంబంధించిన అద్భుతమైన ఫొటోను చూశారు. దీనిని ఒక వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో క్యాప్చర్‌ చేశారు. ఈ ఫొటోను చూసిన వారంతా ఆ ఫొటోగ్రాఫర్‌ను మెచ్చుకోవడంతోపాటు, అతను ఎంతో ధైర్యవంతుడైన క్రియేటర్‌ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 

ఫొటో కోసం 7 గంటల శ్రమ
ఈ అద్భుతమైన ఫొటోను విబుల్డన్‌కు చెందిన వరల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ పాల్‌ గోల్డ్‌స్టీన్‌ తన కెమెరాలో బంధించారు. ఈ చీతా కెన్యాలోని మాసై మారా నేషనల్‌ పార్కులో కనిపించింది. పాల్‌ గోల్డ్‌ ఈ ఫొటో గురించి ఒక మీడియా హౌస్‌లో మాట్లాడుతూ తాను ఈ ఫొటో తీసేందుకు 7 గంటల పాటు వర్షంలో తడిసి ముద్దయ్యానని తెలిపారు. ఈ ఫొటోను ఆయన తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేస్తూ, తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ‘ఆ క్షణంలో మంత్రముగ్ధుడనయ్యాను. అవును.. ఇందుకోసం ఏడు గంటలు వర్షంలో తడిశాను’ అనే కాప్షన్‌ రాశారు. 

‘వారేవాహ్‌.. ఏం టైమింగ్‌రా బాబూ’
ఈ పొటోను పరీక్షగా చూస్తే ఒకే చిరుతకు మూడు తలలు ఉన్నాయని, అవి వేర్వేరు దిశల్లో చూస్తున్నాయని అనిపిస్తుంది. పొటోగ్రాఫర్‌ పర్ఫెక్ట్‌ టైమింగ్‌ అనేది ఈ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫొటోను చూసినవారంతా ‘వారేవాహ్‌.. ఏం టైమింగ్‌రా బాబూ’ అని ఆ ఫొటోగ్రాఫర్‌ను మెచ్చుకుంటున్నారు. నిజానికి అవి మూడు చీతాలు. అవి ఒక దగ్గరే వేర్వేరు యాంగిల్స్‌లో కూర్చున్నాయి. అది ఫొటోగ్రాఫర్‌ కంటపడింది.

ఇది కూడా చదవండి: ఇదేమిటో తెలుసా? 90ల నాటి పిల్లలైతే ఇట్టే చెబుతారు!

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)