ఇరాక్‌లో ఖమేనీ అంతిమయాత్ర.. పోటెత్తిన జనం

Published on Wed, 07/08/2026 - 11:06

కర్బలా: ఇరాన్ దివంగత సర్వోన్నత నేత  అయతొల్లా అలీ ఖమేనీ అంతిమయాత్ర బుధవారం ఇరాక్‌కు చేరుకుంది. షియా ముస్లింల పవిత్ర నగరాలైన నజాఫ్, కర్బలాల్లో ఖమేనీకి వీడ్కోలు పలికేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. గత ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. శనివారం ఇరాన్‌లో ప్రారంభమైన ఆరు రోజుల జాతీయ సంతాప దినాల్లో భాగంగా, ఇరు దేశాల మధ్య ఉన్న ఆధ్యాత్మిక, రాజకీయ సంబంధాలకు ప్రతీకగా ఒక రోజు అంతిమయాత్రను ఇరాక్‌లో నిర్వహించారు.

ఖమేనీ భౌతికకాయాన్ని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, ఇరాక్ ఉన్నతాధికారులు నజాఫ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గౌరవపూర్వకంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఇరాక్ ప్రభుత్వం బుధవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. నజాఫ్‌లోని పవిత్ర ఇమామ్ అలీ దర్గా వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర సాగింది. ఆపై కర్బలాలోని ఇమామ్ హుస్సేన్ దర్గాకు భౌతికకాయాన్ని తరలించారు. అమెరికా, ఇజ్రాయెల్‌లను ఎదిరించిన నేతకు నివాళులర్పించేందుకు ఇరాక్ నలుమూలల నుంచే కాక, ఇతర ప్రాంతాల నుండి కూడా పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. గురువారం ఇరాన్‌లోని ఖమేనీ స్వస్థలమైన మషద్ నగరంలో అంత్యక్రియలు పూర్తికానున్నాయి.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)