Breaking News

న్యూస్ ప్రజెంటర్‌ ప్రాణం తీసిన ఇజ్రాయెల్‌.. ఖండించిన హెజ్‌బొల్లా

Published on Tue, 01/27/2026 - 14:41

జెరూసలేం: హెజ్‌బొల్లా (Hezbollah), హమాస్‌లపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న భీకర దాడులతో పశ్చిమాసియా రగులుతూనే ఉంది. తాజాగా హెజ్‌బొల్లాకు అనుకూలంగా కార్యకలాపాలు నిర్వహించిన ఆల్‌ మనార్‌ టీవీ ప్రజెంటర్‌ అలీ నూర్ అల్-దిన్‌ను ఇజ్రాయెల్‌ సైన్యం హతమార్చింది.

అలీ నూర్‌ అల్‌-దిన్‌ మరణంపై హెజ్‌బొల్లా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రమాదకరమైన ఇజ్రాయెల్‌  లెబనాన్‌లో నిబంధనలను ఉల్లంఘిస్తుందని, అలీ నూర్‌ అల్‌-దిన్‌ ప్రాణాలు తీసిందని తెలిపింది.  

గతంలో అల్-మనార్ ఛానెల్‌లో మతపరమైన కార్యక్రమాల న్యూస్ ప్రజెంటర్‌గా పనిచేసిన అలీ నూర్‌ టైర్‌లో జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. టైర్ శివారులోని అల్-హౌష్‌లో అల్-దిన్ ప్రధాన బోధకుడిగా కూడా పనిచేశాడు. లెబనీస్ సమాచార మంత్రి పాల్ మోర్కోస్ ఇజ్రాయెల్ తీరును ఖండించారు. ‘‘మీడియా కుటుంబానికి మా సంఘీభావం.అలీ నూర్‌ మరణానికి  అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలి. ఉల్లంఘనలు జరగకుండా లెబనాన్‌లోని మీడియా ప్రతినిధుల్ని రక్షించే దిశగా అడుగులు వేయాల’’ని కోరారు.

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)