Breaking News

ఏఐ ఫేస్ స్కాం.. వీడియోలో స్నేహితుని ముఖం చూపించి...

Published on Thu, 05/25/2023 - 15:02

జీవితాన్ని మరింత సుల‌భ‌త‌రం చేసేందుకు మ‌నిషి టెక్నాల‌జీని వీలైనంత మేర‌కు వినియోగిస్తున్నాడు. తాజాగా ఇదే కోవ‌లో మ‌నిషి జీవితంలోకి ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్ర‌వేశించింది. దీనిని అంద‌రూ ఒక అద్భుతంగా భావిస్తున్నారు. అయితే ఇంత‌లోనే ఏఐని అక్ర‌మ కార్య‌క‌లాపాల‌కు వినియోగించ‌డం కూడా మొద‌ల‌య్యింది. డీప్ ఫేక్ ఇమేజ్‌, వీడియో టూల్ మొద‌లైన‌వి ఆన్‌లైన్ మోసాల‌కు ఉప‌క‌రించేవిగా మారిపోయాయి. ఇటువంటి మోసం ఒక‌టి చైనాలో చోటుచేసుకుంది.

ఉత్త‌ర చైనాకు చెందిన ఒక వ్య‌క్తి డీప్ ఫేక్ టెక్నిక్ ఉప‌యోగించి ఐదు కోట్ల‌కుపైగా మొత్తాన్ని కొల్ల‌గొట్టాడు. డీప్‌ఫేక్ అంటే ఫేక్ డిజిట‌ల్ ఫొటో, దీని ఆధారంగా రూపొందించే వీడియో చూసేందుకు నిజ‌మైన‌దిగానే క‌నిపిస్తుంది. దీని ఆధారంగా త‌ప్పుడు స‌మాచారాన్ని వ్యాపింప‌జేసే అవ‌కాశం ఏర్ప‌డుతుంది. మీడియాకు అందిన స‌మాచారం ప్ర‌కారం ఉత్త‌ర చైనాకు చెందిన ఒక మోస‌గాడు డీప్ ఫేక్ టెక్నిక్ సాయంతో ఒక వ్య‌క్తి నుంచి త‌న ఖాతాలోకి కోట్లాది రూపాయ‌లు ట్రాన్స్‌ఫ‌ర్ చేయించుకున్నాడు.

స్కామ‌ర్‌.. ఏఐ- వైఫై ఫేస్ స్వైపింగ్ టెక్నిక్ సాయంతో ఈ మోసానికి పాల్ప‌డ్డాడు. బావోటా సిటీ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం మోస‌గాడు వీడియో కాల్‌లో స్నేహితునిగా మారి, అత‌ని నుంచి 4.3 మిలియ‌న్ల యువాన్లు(సుమారు రూ. 5 కోట్లు) ట్రాన్స్ ఫ‌ర్ చేయాల‌ని కోరాడు. ఈ సంద‌ర్భంగా బాధితుడు మాట్లాడుతూ.. త‌న స్నేహితుడు క‌ష్టాల్లో ఉన్నాడ‌ని న‌మ్మి, తాను డ‌బ్బులు టాన్స్‌ఫ‌ర్ చేశాన‌ని తెలిపాడు. అయితే త‌న స్నేహితుడు అస‌లు విషయం చెప్ప‌డంతో మోస‌పోయాన‌ని గ్ర‌హించాన‌న్నాడు. ఈ ఉదంతంలో పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. 
చదవండి: ఆ రోడ్డుపై ప్ర‌యాణిస్తూ 14 దేశాలు దాటేయొచ్చు.. ఎక్కడుందో తెలుసా!

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)