Breaking News

ఆడవాళ్లను చూస్తే ఊపిరాడదు: అందుకే 55 ఏళ్లు ..!

Published on Sat, 10/14/2023 - 15:33

CallitxeNzamwita Gynophobia మనుషులను రకరకాల భయాలు పట్టిపీడిస్తుంటాయి. సాధారణంగా ఇలాంటి  ఫోబియాలు చనిపోయే దాకా  వారిని వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా దెయ్యాలు, కౄర జంతువులు, పాములు, బల్లులు, నిప్పు, ఎత్తైన ప్రదేశాలు,  చీకటి అన్నా కూడా గజ గజ వణికిపోతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే  పెద్ద జాబితానే ఉంది. అయితే తాజాగా ఆడవాళ్ళంటేనే భయపడిన వ్యక్తి వార్తల్లో నిలిచాడు.

తాజా నివేదికల ప్రకారం రువాండాకు చెందిన 71 ఏళ్ల కాలిటెక్స్‌ నజాంవిటా (Callitxe Nzamwita)ఇలాంటి అసాధారణమైన భయంతో బాధపడుతూ ప్రపంచాన్ని నివ్వెరపర్చాడు. మహిళలంటే ఉన్న భయంతో గత 55 సంవత్సరాలుగా స్వీయ నిర్బంధంలో ఉండిపోయాడు. అతనికి పదహారేళ్ల వయసపుడే ఈ భయం పట్టుకుంది.  అప్పటినుంచి మహిళ కనిపిస్తే చాలు ఇంట్లోకి వెళ్లి తలుపు తాళం వేసుకుంటాడు. 

కాలిటెక్స్‌ నజాంవిటా  స్టోరీ
ఆడవాళ్లంటే దెయ్యాన్ని చూసినట్టు భయపడతాడు. అందుకే నజాంవిటా తన ఇంటి చుట్టూ 15 అడుగుల ఎత్తైన కంచెను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆడవాళ్ళకే కాదు పురుషులకు కూడా దూరంగా ఉంటున్నాడట. అయితే ఇంట్రస్టింగ్‌ విషయం ఏమిటంటే అతణ్ని అర్థం చేసుకున్న ఇరుగు పొరుగు మహిళలు కాలిటెక్స్‌ ఆహారం, కిరాణా సామాన్లు లాంటి అందించి జీవించడానికి సహాయం చేయడం. అతనికి అవసరమైన వాటిని ఇంట్లో వదిలి వెళితే..వారు వెళ్లిపోయాక అపుడువాటిని తీసుకుంటాడు. 

ఫోబియా
Phobia అనేది ఫొబోస్‌ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. గ్రీకు భాషలో ఫొబోస్‌ అంటే భయం. వాస్తవానికి దాన్నించు మనకి ఎలాంటి ప్రమాదం, హాని లేకపోయినా కూడా తీవ్రంగా భయపడిపోవడం.సాధారణంగా మహిళలను చూస్తే భయపడటాన్ని గైనోఫోబియాగా పిలుస్తారు. అందమైన అమ్మాయిలను చూస్తే భయపడటాన్నే వెనుస్ట్రాఫోబియా అంటారు. అలాగే పెళ్లి చేసుకోవాలన్నా, రిలేషన్‌షిప్‌లో ఉండాలన్నా కలిగే భయాన్నే గామోఫోబియా అంటారు. 

గైనోఫోబియా అంటే ఏమిటి? 
స్త్రీల పట్ల ఉండే అహేతుక భయమే గైనోఫోబియా గైనోఫోబియా అంటే డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ (DSM-5)లో అధికారికంగా గుర్తించనప్పటికీ, ది క్లినికల్ సెట్టింగ్‌లో "నిర్దిష్ట భయం"గా వర్గీకరించారు. గైనోఫోబియా లక్షణాలు స్త్రీల పట్ల అహేతుకమైన, తీవ్రమైన భయం. వారి గురించిన ఆలోచనే వారిలో ఆందోళనకు దారితీస్తాయి. ఈ లక్షణాలు ఇతర ఫోబియాల్లో కనిపించేవిగానే ఉంటాయి. ముఖ్యంగా  తీవ్ర భయాందోళనలు, ఛాతీ పట్టేసినట్టు అయిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ముచ్చెమటలు  శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలొస్తాయి.
 

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు