Breaking News

మహిళలు పనిచేసే ఎన్జీవోల మూత

Published on Tue, 12/31/2024 - 05:08

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్‌ పాలకులు మహిళలకు వ్యతిరేకంగా మరో నిర్ణయం తీసుకున్నారు. తమ దేశ మహిళలు పనిచేసే జాతీయ, విదేశీ ప్రభుత్వేతర సంస్థలన్నిటినీ మూసివేయనున్నట్లు సోమవారం ప్రకటించారు. ఇస్లాం సిద్ధాంతాల ప్రకారం ధరించాల్సిన హిజాబ్‌ను ఆయా సంస్థల్లోని అఫ్గాన్‌ మహిళలు ధరించకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఆర్థిక శాఖ ఆదివారం రాత్రి ‘ఎక్స్‌’లో ఈ విషయం వెల్లడించింది. తమ ఉత్తర్వులను బేఖాతరు చేసే సంస్థల లైసెన్సులను రద్దు చేస్తామని, కార్యకలాపాలను నిలిపివేస్తామని కూడా అందులో హెచ్చరించింది. 

నాన్‌ గవర్నమెంటల్‌ సంస్థల రిజిసే్ట్రషన్, సమన్వయం, నిర్వహణ, పర్యవేక్షణ సహా అన్ని కార్యకలాపాల బాధ్యత తమదేనని స్పష్టం చేసింది. తాలిబాన్‌ నియంత్రణలో లేని సంస్థలు అన్నిటిలోనూ మహిళలు పనిచేయడం ఆపేయాలని మరోసారి హుకుం జారీ చేసింది. అత్యవసరమైన మానవతా సాయం అందించే కార్యక్రమాల్లోనూ మహిళల ప్రాతినిథ్యాన్ని తాలిబన్లు అడ్డుకుంటున్నారని ఇటీవల ఐరాస సైతం ఆరోపించడం గమనార్హం. బాలికలు ఆరో గ్రేడ్‌ మించి చదువుకోరాదని, బహిరంగంగా కనిపించే విధుల్లో పాల్గొనరాదని ఇప్పటికే తాలిబన్‌ పాలకులు నిషేధం విధించడం తెలిసిందే. 

కిటికీల నుంచి మహిళలు కనిపించొద్దు 
తాలిబన్‌ నేత హిబతుల్లా అఖుంద్‌జాదా మరో తాఖీదు జారీ చేశారు. మహిళలు, నిలబడి లేదా కూర్చున్నట్లుగా కనబడేలా భవనాలకు కిటికీలు ఉండరాదన్నారు. కొత్తగా నిర్మించే వాటితోపాటు ఇప్పటికే ఉన్న భవనాలకు సైతం ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. వరండాలు లేదా వంటగదులు కనిపించేలా కిటికీలు ఏర్పాటు చేయవద్దన్నారు. ఒక వేళ కిటికీలుంటే భవన యజమాని ఆ స్థానంలో గోడను నిర్మించడం లేదా ఏదైనా అడ్డుగా ఉంచడం చేయాలన్నారు. నివాస భవనాల్లోపలి భాగం కనిపించేలా కొత్తగా భవన నిర్మాణం చేయరాదని ఆయన మున్సిపల్, ఇతర అధికారులకు సైతం నిర్దేశించడం గమనార్హం.  
 

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)