Breaking News

Bangladesh: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాదిపై దాడి.. పరిస్థితి విషమం

Published on Tue, 12/03/2024 - 07:10

ఢాకా: బంగ్లాదేశ్‌లో దేశద్రోహం ఆరోపణలపై అరెస్టయిన చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి తరపు న్యాయవాది రమణ్ రాయ్‌పై దాడి జరిగిందని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్(ఇస్కాన్‌) తెలిపింది.

ఇస్కాన్ ప్రతినిధి రాధారమణ్‌ దాస్ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌లో ‘దయచేసి అడ్వకేట్ రమణ్ రాయ్ కోసం ప్రార్థించండి. అతను చేసిన ఒకేఒక తప్పు చిన్మయ్ కృష్ణ ప్రభు కోసం కోర్టులో వాదించడం. ఇస్లాంవాదులు అతని ఇంటిని ధ్వంసం చేసి, అతనిపై దాడి చేశారు, ప్రస్తుతం  ఆయన ప్రాణాలతో పోరాడుతున్నారు’ అని రాశారు.

బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు న్యాయవాదులు ఈ ఘటనలను ఖండించారు. కాగా చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాది హత్యకు గురయ్యాడంటూ గత నెలలో సోషల్ మీడియాతోపాటు కొన్ని వార్తా కథనాలలో  కనిపించింది. అయితే ఈ ప్రస్తావనలో వచ్చిన లాయర్‌ పేరు సైఫుల్ ఇస్లాం అని విచారణలో తేలింది. ఆయన ప్రభుత్వం తరపు న్యాయవాది అని, అతను చిన్మోయ్ దాస్ కేసులో పోరాడలేదని సమాచారం.

బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారి ఇటీవల రంగ్‌పూర్‌లో హిందువులకు మద్దతుగా జరిగిన నిరసనలకు నాయకత్వం వహించారు. ఆ తరువాత గత నెలలో ఢాకాలో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అతనిపై దేశద్రోహం అభియోగం మోపారు. ఈ నేపధ్యంలో ఢాకా కోర్టు అతనికి బెయిల్ నిరాకరించింది.

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనా బహిష్కరణకు గురైనప్పటి నుండి, మైనారిటీలపై హింసాయుత ఘటనలు జరుగుతున్నాయి. అలాగే వీటిని నిరసిస్తూ పలు ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. బంగ్లాదేశ్‌లోని ఛటోగ్రామ్‌లో చిన్మయ్ కృష్ణ దాస్ శిష్యులు  ఇద్దరు అదృశ్యమయ్యారని రాధారమణ్‌ దాస్ గతంలో ఒక పోస్టులో తెలిపారు. కాగా బంగ్లాదేశ్‌లో హిందువుల అరెస్టులను భారత్‌ ఖండించింది. హిందువులు, ఇతర మైనారిటీలకు భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని  కోరింది.

ఇది కూడా చదవండి: దూసుకొచ్చిన మృత్యువు

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)