పాఠశాలపై దాడి చేసిన ఉగ్రవాదులు.. 25 మంది మృతి 

Published on Sat, 06/17/2023 - 15:30

ఉగాండా: డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దులో ఉన్న ఒక స్కూలుపై ఏడీఎఫ్ తిరుగుబాటుదారులు దాడి చేశారు. ఈ దాడిలో సుమారుగా 25 మంది మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. 

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ అనుబంధ సంస్థగా పేరున్న ఏడీఎఫ్ శుక్రవారం రాత్రి పశ్చిమ ఉగాండాలోని పాండ్వేకు చెందిన లుబిరిరా ఉన్నత పాఠశాలపై దాడికి  తెగబడింది. తిరుగుబాటుదారుల దాడిలో కనీసం 25 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని మరో ఎనిమిది మంది గాయపడ్డారని తెలిపారు ఉగాండా పోలీసులు. 

ఉగాండా పోలీసులు దాడికి సంబంధించిన వివరాలు తెలుపుతూ.. పాండ్వే లుబిరిరా పాఠశాలపై ఏడీఫ్ తీవ్రవాదులు దాడి చేసి పాఠశాల వసతి గృహాన్ని తగలబెట్టి ఆహారాన్ని దొంగిలించుకుపోయారు. ఇప్పటివరకు ఇక్కడ 25 మృతదేహాలను గుర్తించి దగ్గర్లోని బ్వేరా ఆసుపత్రికి తరలించాము.ఇందులో విద్యార్థులు ఎంతమంది చనిపోయారన్న దానిపై స్పష్టత లేదు. దాడి అనంతరం ఉగ్రవాద ముఠా విరుంగా నేషనల్ పార్క్ వైపుగా పారిపోయారని అన్నారు.  

1990ల్లో తూర్పు ఉగాండాలో ఆనాటి అధ్యక్షుడు యోవెరీ ముసెవెనికి వ్యతిరేకంగా ఏడీఎఫ్​ పుట్టుకొచ్చింది. చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్న ఏడీఎఫ్ 2021లో ఉగాండా రాజధాని కంపాలాలో బాంబు దాడికి పాల్పడినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఇన్నాళ్లకి ఏడీఎఫ్ మళ్ళీ వెలుగులోకి వచ్చి పిల్లల పాఠశాలపై దాడులు చేయడం పాశవికమని ఇది ముమ్మాటికీ పిరికిపంద చర్యని అన్నారు ఉగాండా నేత విన్నీ కిజా.  

ఇది కూడా చదవండి: నిద్రలో హఠాత్తుగా లేచి తుపాకీతో కాల్చుకున్నాడు.. కారణం తెలిస్తే షాక్‌..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)