Breaking News

వైద్య రంగంలో అద్భుతం.. ఒకే ఒక పరీక్షతో 70 రకాల క్యాన్సర్లు గుర్తింపు

Published on Wed, 01/21/2026 - 02:11

క్యాన్సర్ మహమ్మారిని ప్రాథమిక దశలోనే  తుడిచిపెట్టేందుకు యూఏఈ వైద్య రంగం విప్లవాత్మక అడుగు ముందుకేసింది. అబుదాబిలోని బుర్జీల్ హాస్పిటల్స్ ప్రవేశపెట్టిన 'ట్రూచెక్ ఇంటెల్లి'  అనే రక్త పరీక్షతో ఒకేసారి  70 రకాల క్యాన్సర్లను గుర్తించవచ్చు.

శరీరంలో క్యాన్సర్ లక్షణాలు కనిపించకముందే, కణాల స్థాయిలో మార్పులను ఈ టెస్టుతో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా 40 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు కలిగిన వారి కోసం ఈ 'ట్రూచెక్ ఇంటెల్లి' పరీక్షను తీసుకొచ్చారు. ఎందుకంటే వయస్సు పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 

అదేవిధంగా ఎండోస్కోపీ లేదా బయాప్సీ వంటి పరీక్షలంటే భయం ఉన్నవారికి ఇదొక గొప్ప ప్రత్యామ్నాయం. ఈ పరీక్షలో ఫలితాల ఖచ్చితత్వం 95 శాతం నుండి 98 శాతం వరకు ఉ‍న్నట్లు తెలుస్తోంది.

ఇదే విషయంపై బుర్జీల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ డాక్టర్ హుమైద్ అల్ షంసీ మాట్లాడుతూ.. మేము నిర్వహించిన సర్వేలో దాదాపు 60 శాతం మంది ప్రజలు ముందస్తు క్యాన్సర్ పరీక్షలకు భయపడుతున్నారని తేలింది. కొలనోస్కోపీ, బయాప్సీ వంటి పరీక్షలపై ఉన్న భయం వల్ల చాలామంది వ్యాధి ముదిరే వరకు డాక్టర్ దగ్గరకు రావడం లేదు. 

ఆ అడ్డంకిని తొలగించేందుకు 'ట్రూచెక్ ఇంటెల్లి' పరీక్షను తీసుకొచ్చాము. ఒక చిన్న రక్త పరీక్షతో ఏ రకమైన క్యాన్సర్‌నైనా గుర్తించవచ్చు. దీంతో ప్రాథమిక దశలోనే చికిత్స ప్రారంభించే అవకాశం ఉంటుంది"అని చెప్పుకొచ్చారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)