Breaking News

వర్జీనియా గవర్నర్‌గా అబిగైల్ స్పాన్‌బెర్గర్

Published on Wed, 11/05/2025 - 08:15

వర్జీనియా: అమెరికాలోని వర్జీనియా మేయర్‌ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నమోదయ్యింది. డెమొక్రాట్ అబిగైల్ స్పాన్‌బెర్గర్ మంగళవారం జరిగిన వర్జీనియా గవర్నర్ ఎన్నికల్లో గెలిచారు. రిపబ్లికన్ లెఫ్టినెంట్ గవర్నర్ విన్సమ్ ఎర్లే-సియర్స్‌ను ఓడించిన ఆమె 2026 మధ్యంతర ఎన్నికలకు వెళ్లే డెమొక్రాట్‌లకు కీలక విజయాన్ని అందించి, సరికొత్త చరిత్ర సృష్టించారు.

కామన్వెల్త్‌కు నాయకత్వం వహించిన తొలి మహిళగా నిలిచిన అబిగైల్ స్పాన్‌బెర్గర్ ఇటీవలే పదవీ విరమణ చేసిన రిపబ్లికన్ గవర్నర్ గ్లెన్ యంగ్‌కిన్ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ఈ విజయంతో తాము కామన్వెల్త్‌లోని ప్రతి మూలకు ఒక సందేశాన్ని పంపామని, దేశవ్యాప్తంగా ఉన్న మా తోటి అమెరికన్లకు తమ సత్తా చూపామని స్పాన్‌బెర్గర్ రిచ్‌మండ్‌ తన ఉత్సాహభరిత ప్రసంగంలో పేర్కొన్నారు.

మంగళవారం జరిగిన ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ గజాలా ఎఫ్. హష్మీ లెఫ్టినెంట్ గవర్నర్ రేసులో గెలిచారు. ఈ పదవిని దక్కించకున్న తొలిమహిళగా హష్మీ నిలిచారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ(సీఐఏ) అధికారి అయిన స్పాన్‌బెర్గర్ ప్రచార సమయంలో దేశంలోని ఆర్థిక సమస్యలను  ఎత్తిచూపారు. ఆమె అనుసరించిన వ్యూహం వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో ఇతర డెమొక్రాట్లకు ఒక నమూనాగా ఉపయోగపడనుంది.

తన ప్రచారంలో స్పాన్‌బెర్గర్ .. అధ్యక్షుడు ట్రంప్‌ విధానాలకు వ్యతిరేకంగా, ఆయన రూపొందించిన ఆర్థిక  ప్రణాళికలను ఎండగట్టారు. ఆమె రిపబ్లికన్ మద్దతు కలిగిన ప్రాంతాలతో సహా వర్జీనియా అంతటా ప్రచారం సాగించారు. యూఎస్‌ ప్రభుత్వ షట్‌డౌన్, సమాఖ్య ఉద్యోగులున్న వర్జీనియాపై దాని ప్రతికూల ప్రభావాన్ని స్పాన్‌బెర్గర్ సమర్థవంతంగా వివరించారు. ఆమె అనుసరించిన ప్రచార విధానం డెమొక్రాట్లను ఏకం చేయడంలో సహాయపడింది.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు