పాక్‌ ఆస్పత్రిలో.. 26/11 ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ మృతి

Published on Wed, 07/23/2025 - 12:25

ఇస్లామాబాద్: భారత పార్లమెంట్‌పై దాడి(2001), 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో కీలక పాత్ర పోషించిన లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ పాకిస్తాన్‌లోని బహవల్‌పూర్‌లో గల ఒక ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ మృతిచెందాడు. మీడియాకు అందిన వివరాల ప్రకారం మే 6న భారత్‌ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన సమయంలో క్షిపణి దాడి  కారణంగా అబ్దుల్ అజీజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇతను లష్కర్‌ ఎ తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరికి అత్యంత సన్నిహితుడని సమాచారం.

అబ్దుల్ అజీజ్ పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తోయిబాకు నిధులను అందించే అగ్రశ్రేణి నిర్వాహకుడు. సోషల్ మీడియాలో ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ అంత్యక్రియలకు సంబంధించిన దృశ్యాలు ప​త్యక్షమయ్యాయి. వీటిలో డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి, అబ్దుర్ రవూఫ్ తదితర సీనియర్ లష్కర్ నేతలు ఆయన మరణానికి దుఃఖిస్తున్నట్లు కనిపిస్తోంది. అజీజ్ గతంలో గల్ఫ్ దేశాలతో పాటు యూకే, యూఎస్‌లోని రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులు,  పాకిస్తాన్ కమ్యూనిటీల నుండి నిధులు సేకరించినట్లు తెలుస్తోంది. అలాగే వివిధ ఉగ్రవాద కార్యకలాపాలకు లాజిస్టిక్స్, ఆయుధ సరఫరా, నియామకాలను అజీజ్‌ చేపట్టాడని తెలుస్తోంది.

అతని మృతి లష్కర్ ఎ తోయిబాకు తీరని లోటుగా ఉ‍గ్రవాదనేతలు భావిస్తున్నారు. అబ్దుల్ అజీజ్ భారత్‌లో జరిగిన పలు ఉగ్రదాడులతో సంబంధం  ఉంది. 2001 పార్లమెంట్ దాడికి పాకిస్తాన్ నుండి డబ్బు, పరికరాలను తరలించడంలో సహాయం చేశాడని నిఘా నివేదికలు తెలియజేస్తున్నాయి. 2006 ముంబై లోకల్ రైలు పేలుళ్లకు కూడా  ఇతను ఆర్థిక సహాయం అందించాడని భావిస్తున్నారు. 2008 ముంబై దాడుల సమయంలో, అజీజ్ సముద్ర మార్గాల ద్వారా ఆయుధాలు, ఉపగ్రహ ఫోన్‌లను అందజేసినట్లు తెలుస్తోంది.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)