Breaking News

ఇజ్రాయెల్‌ చెర నుంచి 90 మంది విడుదల

Published on Tue, 01/21/2025 - 05:40

రమల్లా(వెస్ట్‌ బ్యాంక్‌): ఇజ్రాయెల్‌– హమాస్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతోంది. హమాస్‌ ముందుగా ముగ్గురు ఇజ్రాయెల్‌ బందీలను విడుదల చేయడం తెలిసిందే. దీంతో తమ జైళ్లలోని వెస్ట్‌ బ్యాంక్‌కు చెందిన 90 మంది మహిళలు, చిన్నారులకు సోమవారం ఇజ్రాయెల్‌ స్వేచ్ఛనిచ్చింది. రెడ్‌ క్రాస్‌కు చెందిన బస్సుల్లో వచ్చిన వీరికి వెస్ట్‌ బ్యాంక్‌లోని రమల్లాలో కుటుంబసభ్యులు, బంధువులు, ఆత్మియులు ఘనంగా స్వాగతం పలికారు. ఒక్కసారిగా అందరిలోనూ ఆనందం వెల్లివిరిసింది. 

వారిని కొందరు భుజాలపైకి ఎత్తుకోగా మరికొందరు నినాదాలు, ఈలలతో సంతోషం వ్యక్తం చేశారు. ఇంకొందరు ఫతా, హమాస్, పాలస్తీనా ఇస్లామిక్‌ జిహాద్, ఇతర సాయుధ గ్రూపుల జెండాలు పట్టుకుని గుమికూడారు. వేడుకలు చేసుకోవద్దంటూ ఇజ్రాయెల్‌ బలగాలు చేసిన హెచ్చరికలను వారెవరూ పట్టించుకోలేదు. సోమవారం రమల్లాకు చేరుకున్న వారిలో 69 మంది మహిళలు, 21 మంది టీనేజీ బాలురు ఉన్నారు. వీరిలో 12 ఏళ్ల బాలుడు సైతం ఉన్నాడు. ఒప్పందం మొదటి విడతలో హమాస్‌ 33 మంది బందీలను 42 రోజుల్లో విడుదల చేయాల్సి ఉంది. అదే సమయంలో, ఇజ్రాయెల్‌ వెయ్యి నుంచి రెండు వేల మంది ఖైదీలను విడిచి పెట్టాల్సి ఉంటుంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)