పాక్‌లో ఘోరం.. ఒకే కుటుంబంలోని 9 మంది సజీవ సమాధి

Published on Sun, 01/25/2026 - 04:30

పాకిస్తాన్‌లో పలు ప్రాంతాల్లో భారీగా మంచుకురుస్తోంది. ఖైబర్‌ ప్రావిన్స్‌లో మంచు చరియలు విరిగి ఓ ఇంటిపై పడటంతో అందులోని ఒకే కుటుంబానికి చెందిన 9 మంది సజీవ సమాధి అయ్యారు. ఘటన నుంచి ఒక్క బాలుడు మాత్రమే గాయాలతో తప్పించుకున్నాడని అధికారులు తెలిపారు.

చిత్రాల్‌ జిల్లా దామిల్‌ ప్రాంతంలోని సెరిగాల్‌ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఘటన చోటుచేసుకుందన్నారు. ఆ ప్రాంతంలో 20 అంగుళాల మేర మంచు పేరుకుపోయిందని అధికారులు తెలిపారు. పెద్ద మంచు పలక దిగువకు జారుతూ వచ్చి పర్వతప్రాంతంలోని వీరున్న నివాసంపై పడిందని చెప్పారు.

మృతదేహాలను వెలికి తీశామని, ప్రాణాలతో ఉన్న 9 ఏళ్ల బాలుడిని వెంటనే ఆస్పత్రిలో చేర్చామన్నారు. ఖైబర్‌తోపాటు బలూచిస్తాన్, బల్టిస్తాన్‌ పీవోకేల్లో దట్టమైన మంచు కారణంగా జనజీవనం స్తంభించింది. ఉష్ణోగత్రులు కొన్ని చోట్ల మైనస్‌ 20 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. మంచు కారణంగా రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 
 

#

Tags : 1

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)