Breaking News

8.5 కోట్ల ఏళ్లనాటి డైనోసార్‌ గుడ్లు 

Published on Sat, 09/13/2025 - 05:28

బీజింగ్‌:  భూగోళంపై ఒకప్పుడు భారీ డైనోసార్లు(రాక్షస బల్లులు) ఉండేవన్న సంగతి తెలిసిందే. వాటిపై ఇప్పటికీ అధ్యయనం జరుగుతూనే ఉంది. భూమిని గ్రహ శకలాలు ఢీకొట్టడం లేదా వాతావరణ మార్పుల వల్ల లక్షల సంవత్సరాల క్రితం ఇవి అంతరించిపోయాయని సైంటిస్టులు చెబుతుంటారు. కానీ, చైనాలో 85 మిలియన్ల (8.5 కోట్లు) ఏళ్ల క్రితం నాటి రాక్షస బల్లుల గుడ్లను పరిశోధకులు వెలికితీశారు. అంటే డైనోసార్ల చరిత్ర మనం ఊహించిదానికంటే పురాతనమైనదని స్పష్టమవుతోంది. 

సెంట్రల్‌ చైనాలోని యూన్‌యాంగ్‌ బేసిన్‌లో ఉన్న ఖింగ్‌లాంగ్‌షాన్‌లో తవ్వకాల్లో రాక్షస బల్లుల గుడ్లు లభించాయి. ఇవి ఏ కాలానికి సంబంధించినవో తెలుసుకోవడానికి ఆధునిక కార్పొనేట్‌ యురేనియం–లెడ్‌(యూ–పీబీ) డేటింగ్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఈ గుడ్లు 8.5 కోట్ల ఏళ్ల నుంచే ఇక్కడ ఉన్నట్లు తేల్చారు. 

ఆ కాలాన్ని క్రెటాసియస్‌ పీరియడ్‌ అంటారు. ఆ సమయంలోనే భూమిపై భారీగా వాతావరణ మార్పులు సంభవించాయి. అత్యంత వేడిగా ఉన్న వాతావరణం చల్లబడడం మొదలైంది. ఈ పరిణామమే డైనోసార్లు క్రమంగా అంతరించిపోవడానికి దోహదపడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. డైనోసార్‌ ఎగ్స్‌ విషయంలో కార్పొనేట్‌ యురేనియం–లెడ్‌ డేటింగ్‌ పరీక్ష చేయడం ఇదే మొదటిసారి. ఈ వివరాలను ఎర్త్‌ సైన్స్‌ పత్రికలో ప్రచురించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)