Breaking News

78 ఏళ్లకు లవ్‌ ప్రపోజల్‌..39 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి!

Published on Wed, 01/28/2026 - 14:32

వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు లేదా జ్ఞాపకశక్తిని కోల్పోవడంతో సమస్యలు జఠిలంగానే ఉంటాయి. ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న పెద్దవాళ్లున్న కుటుంబాలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాధికా కారణాలు ఏమైనప్పటికీ తమ ఇంటిని, ఇంట్లోని వారిని మర్చిపోతూ ఉంటారు.  మరికొంతమంది తమ జీవిత భాగస్వామిని కూడా గుర్తు పట్టలేని స్థితిలో ఉంటారు. అలా అల్జీమర్స్  బాధపడుతున్న 77 ఏళ్ల మైఖేల్ ఓ'రైలీ  లవ్‌ స్టోరీ నెట్టింట సందడిగా మారింది.


సుమారు  ఏడేళ్ల క్రింత ఓ'రైలీకి అల్జీమర్స్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ కష్టకాలంలో అతనికి అండగా నిలబడి,  అతని బార్య ఫెల్డ్‌మాన్ దగ్గరుండి భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటోంది. మైఖేల్‌ గడపదాటితే దారి మర్చిపోయేవాడు. చివరికి నిరంతరం తనకు సేవలందిస్తున్న భార్యను కూడా మర్చిపోయాడు. దీంతో ఓ'రైలీ 'ది ఐవీ' అనే సంరక్షణ కేంద్రంలో చేరాడు. ఫెల్డ్‌మాన్ తన భార్య అని  మర్చిపోయాడు. కానీ విచిత్రంగా 39  ఏళ్ల తరువాత  ఆమెతో మళ్లీ ప్రేమలో  పడిపోయాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని లిండా ఫెల్డ్‌మన్‌ను ధైర్యంగా అడిగేశాడు.  దీంతో ఆమె మారు మాట్లాడకుండానే ఓకే చెప్పేసింది.

అక్కడి సిబ్బందికి  మైఖేల్‌  లవ్  ప్రపోజల్‌ గురించి తెలిసింది.  ఈ ప్రేమ జంటకు మళ్లీ పెళ్లి చేయాలనే ఆలోచన పుట్టింది. జనవరి 10న, హోం సంరక్షకులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక ఆత్మీయ వేడుకలో,  ది ఐవీఎట్ బర్కిలీలో వారిద్దరూ మరోసారి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇలాంటి ప్రేమ కథలే హృదయాలను మురిపిస్తాయి. నిజమైన ప్రేమ శాశ్వతం అనే నమ్మకాన్ని పుట్టిస్తాయి.

వీరి ప్రేమ కథ 
న్యాయవాద వృత్తిలో ఉన్న ఇద్దరూ అలమెడ కౌంటీలో పబ్లిక్ డిఫెండర్లుగా పనిచేసేవారు. మంచి అటార్నీ వాదనలు చూడాలంటే, కచ్చితంగా మైఖేల్‌ను చూడాల్సిందే అన్న స్నేహితుల మాటలకు ప్రభావితమై అతణ్ణి కలిసింది. అద్భుతమైన లాయర్‌ అనుకొంది. అంతే అప్పటినుంచి మైఖేల్‌ ఫెల్డ్‌మన్‌కు గురువుగా మారాడు. అలా వీరి పరిచయం 1979 నాటికి  గాఢమైన స్నేహంగా మారింది. అప్పటికి ఇద్దరికి వివాహాలు అయ్యాయి. ఓ'రైలీకి మొదటి వివాహం ద్వారా ఇద్దరు కుమార్తెలు,  ఫెల్డ్‌మాన్‌కు ఒక కుమారుడు ఉన్నాడు. కొన్ని  ఏళ్ల తర్వాత వారిద్దరూ తమ భాగస్వాముల నుండి విడాకులు తీసుకున్నారు.

ఫెల్డ్‌మన్‌కు ఫోరెన్సిక్ పాథాలజీపై ఆసక్తి ఉందని గమనించ ఆ కోణంలో ఒక అవకాశాన్నిచ్చిన ఓ'రైలీ ఫెల్డ్‌మన్‌ను డేట్‌కు రమ్మని అడిగాడు. ఫెల్డ్‌మన్ తొలుత సంశయించినప్పటికీ, చివరికి ఒప్పుకుంది.  అలా వారిద్దరూ శవపరీక్ష చూడటానికి వెళ్లి, ఆ తర్వాత డిన్నర్‌ డేట్‌కు వెళ్లారు. అక్కడ పరస్పరం చర్చించు కుని  తమ పిల్లలతో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. అయితే వారి ప్రయాణం అంతా సాఫీగా సాగలేదు, వారి పిల్లలు వారి ప్రేమను అర్థం చేసు కోవడానికి ఇబ్బంది పడ్డారు.  మొత్తానికి 1987లో తమ నివాసంలోని గదిలోనే ఎలాంటి  హంగూ ఆర్బాటం లేకుండా వివాహం చేసుకున్నారు.

తాను ఒక నాడీ సంబంధిత సమస్యలున్న చిన్న యూదు అమ్మాయినని,  భర్త ఒక ఐరిష్ కాథలిక్ సాహస ప్రియుడని చెప్పింది. నాకు థియేటర్, ఆయనకు మ్యూజియంలంటే చాలా ఇష్టం అని గుర్తు చేసుకుంది ఫెల్డ్‌మన్‌కు.  తనకు రివర్ రాఫ్టింగ్ వంటివి పరిచయం చేసింది తన భర్తేనని చెప్పింది. ఇద్దరికీ విభిన్న దిశలు అయినా  కలిసి విస్తృతంగా ప్రయాణించారు. దేని గురించైనా మాట్లాడు కోవడం, ఒకర్ని మరొకరు గౌరవించుకునే లక్షణమే వారి బంధాన్ని సజీవంగా ఉంచిందనడంలో సందేహం లేదు.

మరోవైపు ఫెల్డ్‌మాన్ తన భర్త గురించి మాట్లాడుతూ అల్జీమర్స్‌తో బాధపడుతున్న చాలామంది తమ జీవిత భాగస్వామిని కూడా గుర్తించలేరు. కానీఇపుడు తాను చాలా అదృష్టవంతురాలినని, ఎందుకుంటే తన భర్త అంతులేని ప్రేమతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ముద్దుపెట్టి, 'ఐ లవ్ యూ' అని చెబుతాడు అంటూ తెగ మురిసిపోయింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)